ట్రాన్స్ ఉమన్‌ యాడ్‌.. స్టీరియోటైప్స్ బ్రేక్ చేసిన భీమ జ్యువెలరీస్

దిశ, ఫీచర్స్ : బయటకు కనిపించే రూపం ఒకటైతే.. లోపల అనుభవించే ఫీలింగ్స్ వేరు. సొంత శరీరంతోనే నిరంతర యుద్ధం.. నాలుగు గోడల మధ్యే తాము కోరుకున్న ప్రపంచం. బయటకు ప్రదర్శిస్తే నిర్భంధమే. వాళ్ల ఫీలింగ్స్‌తో సొంత కుటుంబ సభ్యులు సహా ఎవరికీ పనిలేదు. ఓ వైపు వయసుతో పాటు పెరుగుతున్న భావాలు ఆందోళనకు గురిచేస్తున్నా.. అప్పటికే తమ నడవడిక పట్ల తోటివారు గేలిచేస్తున్నా మౌనం వహించడమే తప్ప మరో మాట మాట్లాడే అవకాశం లేదు. తాము […]

Update: 2021-04-16 07:32 GMT

దిశ, ఫీచర్స్ : బయటకు కనిపించే రూపం ఒకటైతే.. లోపల అనుభవించే ఫీలింగ్స్ వేరు. సొంత శరీరంతోనే నిరంతర యుద్ధం.. నాలుగు గోడల మధ్యే తాము కోరుకున్న ప్రపంచం. బయటకు ప్రదర్శిస్తే నిర్భంధమే. వాళ్ల ఫీలింగ్స్‌తో సొంత కుటుంబ సభ్యులు సహా ఎవరికీ పనిలేదు. ఓ వైపు వయసుతో పాటు పెరుగుతున్న భావాలు ఆందోళనకు గురిచేస్తున్నా.. అప్పటికే తమ నడవడిక పట్ల తోటివారు గేలిచేస్తున్నా మౌనం వహించడమే తప్ప మరో మాట మాట్లాడే అవకాశం లేదు. తాము అనుభవిస్తు్న్న సంఘర్షణను సొంత కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేరు. చెప్పినా ఒప్పుకుంటారన్న గ్యారంటీ లేదు. ఒకవేళ అర్థం చేసుకున్నా సొసైటీ కట్టుబాట్లకు తలవంచడమే తప్ప పదిమందికి చెప్పేటంత ఆదర్శ భావాలు ఉండవు. అవును.. ఇవన్నీ ఇండియాలోని ఎల్‌జీబీటీ వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యలే. ఈ విషయంపై దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చినా సరే.. ఇప్పటికీ హోమోసెక్సువల్ పర్సన్స్ పట్ల సమాజ దృక్పథంలో మార్పు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే కేరళకు చెందిన ‘భీమ జ్యువెల్లర్స్’ తాజా ప్రకటనతో ఓ కొత్త సంప్రదాయానికి తెరతీసింది.

‘ప్యూ్ర్ యాజ్ లవ్’ ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఈ యాడ్‌లో పురుషుడి శరీరంతో స్త్రీ లక్షణాలు కలిగివున్న ఓ ట్రాన్స్‌జెండర్ ఉమన్ అంతర్గత సంఘర్షణను చిత్రించారు. క్రమంగా తన స్వభావాలు, ఫీలింగ్స్‌పై రియలైజ్ అయి తను మహిళ అనే విషయాన్ని అంగీకరించి.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే క్రమంలో ఫ్యామిలీ కూడా తనకు సపోర్ట్ చేయడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. 96 ఏళ్ల ప్రముఖ కేరళ జ్యువెలర్స్ ఈ యాడ్ ద్వారా సున్నితమైన అంశాన్ని గౌరవప్రదంగా చిత్రించిన విధానం నిజంగా ప్రశంసనీయం. మూసపద్ధతులకు స్వస్తిచెబుతూ ఒక సాంప్రదాయక జ్యువెలరీ కంపెనీ ఇలాంటి సున్నితమైన అంశంపై ధైర్యంగా ఒక స్టాండ్ తీసుకోవడాన్ని పాత్ బ్రేకింగ్‌గా చెప్పుకోవచ్చు.

ఆ యువకుడి అంతర్గత భావాలను అంగీకరించిన తల్లిదండ్రులు.. అతడు అమ్మాయిగా కొత్త జీవితం ప్రారంభించేందుకు అడుగుడుగునా అండగా ఉంటారు. ఈ క్రమంలోనే మొదటిసారి తనకు బంగారు పట్టీలు బహుమతిగా అందజేసి, అవి పెట్టుకున్నాక ఆ అమ్మాయి కళ్లల్లో ఆనందాన్ని చూసి మురిసిపోతుంటారు. స్వయంగా తన తండ్రే చెవులు కుట్టగా, తల్లి టైలరింగ్ షాపుకు తీసుకెళ్లి అమ్మాయిలు ధరించే దుస్తువుల స్టిచ్చింగ్‌కు ఆర్డర్ ఇస్తుంది. ఇక నానమ్మ జుట్టు దువ్వి అలంకరించడం.. చివరగా కుటుంబ సభ్యులందరూ కలిసి పర్ఫెక్ట్ అమ్మాయిగా నగలతో అలంకరించి పెళ్లి మంటపానికి ఆనందోత్సాహాల మధ్య తీసుకెళ్లడం వంటి సన్నివేశాలు, హార్ట్ టచింగ్ మూమెంట్స్‌తో ఉన్న యాడ్ ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పిస్తుండగా.. ట్రాన్స్ ఉమెన్ అయితే పూర్తిగా కనెక్ట్ అయిపోయారు.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేదా చుట్టుపక్కలవారు తమకు నచ్చిన వ్యక్తుల ఇష్టాలు, భావాలను అర్థంచేసుకుని అంగీకరించడం ఎంత కీలకమనే విషయాన్ని ఈ ప్రకటన ద్వారా హృద్యంగా చూపెట్టారు. వారి నిర్ణయాలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే వారి ప్రపంచం ఎంత అందంగా మారుతుందో ఆవిష్కరించారు. ఇక ఈ ప్రకటనలో నటించిన మీరా సింగానియా నిజంగానే ట్రాన్స్ ఉమన్ కావడం విశేషం. ఈ ప్రకటన వల్ల భీమ జ్యువెలరీ బ్రాండ్‌కు లాభం చేకూరుతుందా అన్న విషయం పక్కనబెడితే.. మిగతా పోటీ కంపెనీలు చేయని సాహసాన్ని చేసిన భీమ్ జ్యువెలరీ ఓ కొత్త ఒరవడిని సృష్టించడం అభినందనీయం.

Tags:    

Similar News