హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఓ విచిత్రం: భట్టి విక్రమార్క

దిశ, కమలాపూర్: టీఆర్ఎస్ నాయకులు ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎవరు ఎక్కువ దోపిడీ చేశారు అనేది తేల్చేదే ఉప ఎన్నిక ఫలితం అంటూ చురకలు వేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా విచిత్ర పరిస్థితిలో జరుగుతుందని, రాష్ట్రంలో ఇటువంటి విచిత్ర ఎన్నిక ఎప్పుడు జరగలేదని అన్నారు. […]

Update: 2021-10-21 11:10 GMT

దిశ, కమలాపూర్: టీఆర్ఎస్ నాయకులు ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎవరు ఎక్కువ దోపిడీ చేశారు అనేది తేల్చేదే ఉప ఎన్నిక ఫలితం అంటూ చురకలు వేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా విచిత్ర పరిస్థితిలో జరుగుతుందని, రాష్ట్రంలో ఇటువంటి విచిత్ర ఎన్నిక ఎప్పుడు జరగలేదని అన్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ అవినీతి చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తే.. మిగతా మంత్రులు కూడా తనకన్న ఎక్కువగా అక్రమాలు చేశారని ఈటల ఆరోపించడం టీఆర్ఎస్ అవినీతికి నిదర్శనమన్నారు. గత ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఇప్పుడు వాళ్లకు వాళ్లే బయటకు వచ్చి వాస్తవాలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు వీరి వైఖరిని చూసి ఆశ్చర్యపడుతున్నారన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం దోపీడీకి గురి కాకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పింగళి వెంకటరెడ్డి, నాయకులు సంమిడ్ల శ్రీనివాస్, దొమ్మాటి సాంబయ్య, తౌటం రవీందర్ మండల అధ్యక్షులు చరణ్ పటేల్ పాల్గొన్నారు.

Tags:    

Similar News