పాక్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు మద్దతునిచ్చే విధానానికి ఇస్లామాబాద్ స్వస్తి పలకాలి. స్వదేశం నుంచి టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ ఇతరదేశాల్లో దాడులు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలి’ అని పాక్ హైకమిషన్‌ను భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. ‘జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో డీడీసీ ఎన్నికల ప్రక్రియను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్టు నలుగురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు సామగ్రి తెలుపుతున్నది. ఈ దాడి […]
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు మద్దతునిచ్చే విధానానికి ఇస్లామాబాద్ స్వస్తి పలకాలి. స్వదేశం నుంచి టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ ఇతరదేశాల్లో దాడులు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలి’ అని పాక్ హైకమిషన్‌ను భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది.
‘జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో డీడీసీ ఎన్నికల ప్రక్రియను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్టు నలుగురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు సామగ్రి తెలుపుతున్నది. ఈ దాడి కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పాకిస్తాన్ దౌత్యకార్యాలయానికి సమన్లు పంపామ’ని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.