భారత్ బయోటెక్ కీలక ప్రకటన

దిశ వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కి చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. కరోనాను నివారించడంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ 81 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని భారత్ బయోటెక్ వెల్లడించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ అనంతరం ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది. రెండవ డోస్ తర్వాత ముందస్తు ఇన్ఫెక్షన్ లేనివారిలో కోవిడ్‌ను నివారించడంలో కోవాగ్జిన్ 81 శాతం మధ్యంతుర సామర్థ్యాన్ని ప్రదర్శించిందని తెలిపింది. 25,800 మంది నుంచి 1:1 నిష్పత్తిలో డేటా సేకరించిన అనంతరం టీకా […]

Update: 2021-03-04 00:50 GMT

దిశ వెబ్‌డెస్క్: హైదరాబాద్‌కి చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. కరోనాను నివారించడంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ 81 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని భారత్ బయోటెక్ వెల్లడించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ అనంతరం ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది. రెండవ డోస్ తర్వాత ముందస్తు ఇన్ఫెక్షన్ లేనివారిలో కోవిడ్‌ను నివారించడంలో కోవాగ్జిన్ 81 శాతం మధ్యంతుర సామర్థ్యాన్ని ప్రదర్శించిందని తెలిపింది.

25,800 మంది నుంచి 1:1 నిష్పత్తిలో డేటా సేకరించిన అనంతరం టీకా పొందిన అభ్యర్థి కరోనాను తట్టుకోగలదని తేలిందని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అత్యవసర పరిస్థితిలో వినియోగించుకునేందుకు కోవాగ్జిన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కాగా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 62 శాతం ప్రభావంతంగా పనిచేస్తుండగా.. పీజర్ బయోటెక్ వ్యాక్సిన్ 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ అనంతరం వెల్లడైంది. ఇక సృతిక్ వి వ్యాక్సిన్ 92 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.

Tags:    

Similar News