భద్రాద్రి ఆలయంలో కరోనా కలకలం.. ఉద్యోగి మృతి

దిశ, భద్రాచలం టౌన్: భద్రాచలం రాములవారి ఆలయ ఉద్యోగులను కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే దాదాపు 15 మంది దాకా కరోనా బారినపడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా.. ఆలయంలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న వెంకన్న(40) సోమవారం కరోనాతో మరణించారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1995 నుంచి వెంకన్న భద్రాచలం రామాలయంలో వివిధ విభాగాలలో పనిచేస్తూ తనదైన […]

Update: 2021-05-17 08:35 GMT

దిశ, భద్రాచలం టౌన్: భద్రాచలం రాములవారి ఆలయ ఉద్యోగులను కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే దాదాపు 15 మంది దాకా కరోనా బారినపడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా.. ఆలయంలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న వెంకన్న(40) సోమవారం కరోనాతో మరణించారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1995 నుంచి వెంకన్న భద్రాచలం రామాలయంలో వివిధ విభాగాలలో పనిచేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. భద్రాచలం వచ్చే వీఐపీలకు ప్రత్యేకంగా దర్శనం చేయించడంలో వెంకన్న ముందుండేవాడు. వెంకన్న మృతి పట్ల భద్రాచలం ఆలయ ఈవో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆలయం తరఫున వెంకన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News