క‌రోనాతో భ‌ద్రాచ‌లం డిప్యూటీ డీఎంహెచ్‌వో మృతి

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా ప‌నిచేస్తున్న‌ డాక్ట‌ర్ న‌రేష్ శుక్ర‌వారం ఉద‌యం క‌రోనాతో మృతిచెందారు. మణుగూరు కరోనా క్వారంటైన్ సెంటర్ ఇంచార్జ్‌గా పనిచేస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందారు. శుక్ర‌వారం ఉద‌యం ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించిన‌ట్టు అధికారులు తెలిపారు. న‌రేష్‌కుమార్ మ‌ర‌ణంతో జిల్లా వైద్య వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. […]

Update: 2020-08-07 01:42 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా ప‌నిచేస్తున్న‌ డాక్ట‌ర్ న‌రేష్ శుక్ర‌వారం ఉద‌యం క‌రోనాతో మృతిచెందారు. మణుగూరు కరోనా క్వారంటైన్ సెంటర్ ఇంచార్జ్‌గా పనిచేస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

దీంతో ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందారు. శుక్ర‌వారం ఉద‌యం ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించిన‌ట్టు అధికారులు తెలిపారు. న‌రేష్‌కుమార్ మ‌ర‌ణంతో జిల్లా వైద్య వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో తాము విధులు నిర్వ‌హించాల్సి వ‌స్తోంద‌ని ఆందోళ‌‌న వ్య‌క్తం చేస్తున్నారు.

న‌ల్ల‌రిబ్బ‌న్ ధ‌రించి ఆయన కుటుంబ స‌భ్యుల‌కు జిల్లా వైద్య అధికారులు, సిబ్బంది ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాడ సానుభూతి తెలిపారు. ప్రజలు అందరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కు వాడాలని, స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్ర‌భుత్వం వైద్యుల‌కు, సిబ్బందికి స‌రైన ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని, ఆస్ప‌త్రుల్లో వైద్య స‌దుపాయాల‌ను మెరుగుప‌ర్చాల‌ని నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ న‌ల్ల రిబ్బ‌న్ ధ‌రించి విధులు నిర్వ‌హిస్తున్నారు.

Tags:    

Similar News