పండుగలొస్తున్నాయ్ జాగ్రత్త
దిశ,తెలంగాణ బ్యూరో : రాబోయే ఉత్సవాలు, పండుగలను దృష్టిలో ఉంచుకొని రద్దీగా ఉండే ప్రదేశాల్లో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని లేదంటే కరోనా విజృంభించే అవకాశం ఉందని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. రాష్ట్రాల్లో జరిగే గణేష్ ఉత్సవాలు, పండుగల నిర్వహణలో కొవిడ్ రూల్స్ పాటించాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు బుధవారం కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న బోనాలు ఉత్సవాల్లో ప్రజలు భారీ ఎత్తున గుమిగూడుతున్నందున కరోనా విజృంభించే అవకాశం ఉందని సూచించింది. […]
దిశ,తెలంగాణ బ్యూరో : రాబోయే ఉత్సవాలు, పండుగలను దృష్టిలో ఉంచుకొని రద్దీగా ఉండే ప్రదేశాల్లో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని లేదంటే కరోనా విజృంభించే అవకాశం ఉందని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. రాష్ట్రాల్లో జరిగే గణేష్ ఉత్సవాలు, పండుగల నిర్వహణలో కొవిడ్ రూల్స్ పాటించాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు బుధవారం కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న బోనాలు ఉత్సవాల్లో ప్రజలు భారీ ఎత్తున గుమిగూడుతున్నందున కరోనా విజృంభించే అవకాశం ఉందని సూచించింది. కరోనా కేసులు పెరిగితే ఆ బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది. కేంద్రం సూచించిన ఐదు దశల వ్యూహాలైన టెస్ట్- ట్రాక్- ట్రీట్- టీకా అమలుపరచి కొవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని తెలిపింది.