ఐపీఎల్ vs లాక్‌డౌన్.. జోరుగా బెట్టింగ్ దందా!
దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్.. అంటే అందరికీ గుర్తొచ్చే ఐపీఎల్. ఎక్కువగా ఎవరైనా ఆటలమీదనే బెట్టింగ్ పెట్టడం మనం ఇప్పటివరకూ చూశాం. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుండటతో జోరుగా బెట్టింగ్ ప్రక్రియసాగుతోంది. అయితే.. తాజాగా బెట్టింగ్ రాయుళ్లు ట్రెండు మార్చారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వాళ్లు వదిలేయడం లేదు. ముఖ్యంగా ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై భారీగా బెట్టింగ్ జరుగింది. ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్ సర్వేలు భిన్నమైన రీతిలో వెలువడటంతో బెట్టింగ్ దందాలు బాగా పెరిగిపోయాయి. వివిధ పార్టీల […]
దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్.. అంటే అందరికీ గుర్తొచ్చే ఐపీఎల్. ఎక్కువగా ఎవరైనా ఆటలమీదనే బెట్టింగ్ పెట్టడం మనం ఇప్పటివరకూ చూశాం. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుండటతో జోరుగా బెట్టింగ్ ప్రక్రియసాగుతోంది. అయితే.. తాజాగా బెట్టింగ్ రాయుళ్లు ట్రెండు మార్చారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వాళ్లు వదిలేయడం లేదు. ముఖ్యంగా ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై భారీగా బెట్టింగ్ జరుగింది. ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్ సర్వేలు భిన్నమైన రీతిలో వెలువడటంతో బెట్టింగ్ దందాలు బాగా పెరిగిపోయాయి. వివిధ పార్టీల గెలుపుపై కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగిన్నట్లు సమచారం.
తాజాగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదుకావడంతో మరోసారి పలు రాష్ట్రాలు కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నాయి. కేంద్రం కూడా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తుందనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు, ఫలానా తేదీ నుంచి లాక్‌డౌన్ అంటూ న్యూస్ వైరల్ చేస్తున్నారు. దేశంలో లాక్‌డౌన్ విధిస్తారంటూ భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మే 2 నుంచి లాక్ డౌన్ ఉంటుందంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. నెల రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. క్రికెట్ బెట్టింగ్ లాగే లాక్‌డౌన్‌పై కూడా యువత బెట్టింగులు కాస్తున్నారు. జనాల వీక్‌నెస్‌ను ఇలా కూడా బెట్టింగు రాయుళ్లు తమకు అనుకూలంగా మలచుకుని జేబులు నింపుకుంటున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో నిఘా పెట్టారు.