ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

దిశ, న్యూస్​బ్యూరో: ఉపాధ్యాయుల దినోత్సవం (సెప్టెంబర్​ 5) సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు అర్హత గల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, లెక్చరర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించి, తుది జాబితాను తమకు అందజేయాల్సిందిగా డీఈఓలను రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. 15 ఏండ్ల అనుభవం కలిగి, ఎస్​ఎస్​సీలో 9+ జీపీఏ సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు 2018–19, 2019–20 ఏడాదిల్లో పాఠశాలల ఫార్మార్ఫెన్స్​ ఆధారంగా అర్హులను నిర్ణయిస్తారు. జిల్లా స్థాయిలో […]

Update: 2020-07-31 11:13 GMT

దిశ, న్యూస్​బ్యూరో: ఉపాధ్యాయుల దినోత్సవం (సెప్టెంబర్​ 5) సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు అర్హత గల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, లెక్చరర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించి, తుది జాబితాను తమకు అందజేయాల్సిందిగా డీఈఓలను రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించింది. 15 ఏండ్ల అనుభవం కలిగి, ఎస్​ఎస్​సీలో 9+ జీపీఏ సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు 2018–19, 2019–20 ఏడాదిల్లో పాఠశాలల ఫార్మార్ఫెన్స్​ ఆధారంగా అర్హులను నిర్ణయిస్తారు.

జిల్లా స్థాయిలో కలెక్టర్​ ఛైర్మన్​గా గల కమిటీ ఉపాధ్యాయులను ఎంపిక చేసి రాష్ట్ర విద్యాశాఖకు జాబితాను పంపిస్తారు. రాష్ట్ర స్థాయిలో స్కూల్​ ఎడ్యూకేషన్​ సెక్రెటరీ స్థాయి అధికారితో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ అవార్డు గ్రహీతలను ఫైనల్ చేస్తుంది. మూడు విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా 43 మందికి ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందించనున్నారు. జిల్లా కమిటీలు ఆగస్టు 7లోపు ఎంపిక చేసిన ఉపాధ్యాయుల జాబితాను​ అందించాల్సి ఉంటుంది. సెప్టెంబర్​ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అందజేస్తారు.

Tags:    

Similar News