బెంగళూరులో మధ్యప్రదేశ్ మంత్రి అరెస్టు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మధ్యప్రదేశ్‌ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం సింధియా అఫీషియల్‌గా బీజేపీలో చేరగా సింధియా అనుచరగణమంతా బెంగళూరులోని గోల్ఫ్‌షైర్ హోటల్‌లో బస చేస్తున్నారు. రెబల్స్ ఎమ్మెల్యేలు రాజీనామా అయితే చేశారు కానీ, అవి ఇంకా ఆమోదం పొందలేదు. రాజీనామాలు ఆమోదం పొందితే ఎక్కడ కమల్‌‌నాథ్ సర్కారు కూలిపోతుందేమోనన్న భయంతో మధ్యప్రదేశ్ మంత్రి జీతూరాయ్ పట్వారీ గురువారం బెంగళూరుకు చేరుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడి ‘రాజీ’కీయాలు […]

Update: 2020-03-12 07:07 GMT

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మధ్యప్రదేశ్‌ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం సింధియా అఫీషియల్‌గా బీజేపీలో చేరగా సింధియా అనుచరగణమంతా బెంగళూరులోని గోల్ఫ్‌షైర్ హోటల్‌లో బస చేస్తున్నారు. రెబల్స్ ఎమ్మెల్యేలు రాజీనామా అయితే చేశారు కానీ, అవి ఇంకా ఆమోదం పొందలేదు. రాజీనామాలు ఆమోదం పొందితే ఎక్కడ కమల్‌‌నాథ్ సర్కారు కూలిపోతుందేమోనన్న భయంతో మధ్యప్రదేశ్ మంత్రి జీతూరాయ్ పట్వారీ గురువారం బెంగళూరుకు చేరుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడి ‘రాజీ’కీయాలు చేద్దామని అనుకున్నారు. అందులో భాగంగానే వారు బస చేస్తున్న హోటల్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హోటల్ పరిసరాల్లో కొంత హైడ్రామా నడిచింది. పరిస్థితి ఎక్కడ చేజారుతుందోనని భావించిన పోలీసులు మంత్రిని అదుపులోకి తీసుకున్నారు.

Tags: madhya pradesh minister, jitu rai patwari, congress rebels, in golfshire hotel

Tags:    

Similar News