సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన బెనెల్లీ!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మోటార్‌సైకిల్, సూక్టర్ తయారీ సంస్థ బెనెల్లి గురువారం తన కొత్త ఎంట్రీ లెవల్ బైక్ టీఆర్‌కే 251ను విడుదల చేసింది. అడ్వెంచర్ బైక్ విభాగంలో వస్తున్న ఈ మోటార్‌సైకిల్ ధరను రూ. 2.5 లక్షలు(ఎక్స్‌షోరూం)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్‌లను ప్రారంభించామని, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదంటే నేరుగా షోరూమ్‌లలో రూ. 6,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. బుకింగ్ చేసుకున్న వారికి 2022, జనవరి నుంచి […]

Update: 2021-12-16 08:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మోటార్‌సైకిల్, సూక్టర్ తయారీ సంస్థ బెనెల్లి గురువారం తన కొత్త ఎంట్రీ లెవల్ బైక్ టీఆర్‌కే 251ను విడుదల చేసింది. అడ్వెంచర్ బైక్ విభాగంలో వస్తున్న ఈ మోటార్‌సైకిల్ ధరను రూ. 2.5 లక్షలు(ఎక్స్‌షోరూం)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్‌లను ప్రారంభించామని, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదంటే నేరుగా షోరూమ్‌లలో రూ. 6,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది.

బుకింగ్ చేసుకున్న వారికి 2022, జనవరి నుంచి బైకులను డెలివరీ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. భారత్‌లో యువతరం కోరుకునే అడ్వెంచర్ మెషీన్ బైకును లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. టీఆర్‌కే 251 మెరుగైన పనితీరుని అందించే ఇంజిన్, డిజైన్, ఆకర్షణీయమైన స్టైలింగ్‌తో వస్తోందని’ బెనెల్లి ఇండియా ఎండీ వికాస్ జబక్ అన్నారు. ఇప్పటికే కంపెనీ టీఆర్‌కే మోడల్ తరహాలోనే ఈ కొత్త టీఆర్‌కే 251 దిజైన్ ఉంటుందని, అయితే కొన్ని కొత్త మార్పులు చేశామని, ఇది గ్లాసీ వైట్, గ్లాసీ గ్రే, గ్లాసీ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. అలాగే, ఈ బైకును కొనాలనుకునే వారికి మూడేళ్ల పాటు అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారెంటీ అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News