బెన్ స్టోక్స్‌ను హెచ్చరించిన అంపైర్లు.. ఎందుకంటే..?
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్‌స్టోక్స్‌ను అంపైర్లు మరోసారి మందలించారు. పూణేలో ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో బంతికి ఉమ్మి రాయడంతో అంపైర్లు అతడిని హెచ్చరించారు. ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టాప్లే బౌలింగ్ వేస్తున్న క్రమంలో బ్యాట్స్‌మాన్ కొట్టిన బంతి స్టోక్స్ వద్దకు వెళ్లింది. అతడు మర్చిపోయి బంతికి ఉమ్మిని రాసి రుద్దాడు. దీన్ని గమనించిన అంపైర్లు నితిన్ మీనన్, వీరేందర్ శర్మ కెప్టెన్ జాస్ బట్లర్ సమక్షంలో స్టోక్స్‌ను […]
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్‌స్టోక్స్‌ను అంపైర్లు మరోసారి మందలించారు. పూణేలో ఇండియాతో జరుగుతున్న రెండో వన్డేలో బంతికి ఉమ్మి రాయడంతో అంపైర్లు అతడిని హెచ్చరించారు. ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టాప్లే బౌలింగ్ వేస్తున్న క్రమంలో బ్యాట్స్‌మాన్ కొట్టిన బంతి స్టోక్స్ వద్దకు వెళ్లింది. అతడు మర్చిపోయి బంతికి ఉమ్మిని రాసి రుద్దాడు. దీన్ని గమనించిన అంపైర్లు నితిన్ మీనన్, వీరేందర్ శర్మ కెప్టెన్ జాస్ బట్లర్ సమక్షంలో స్టోక్స్‌ను హెచ్చరించారు. అనంతరం శానిటైజ్ చేసి తిరిగి ఆట ప్రారంభించారు. గతంలో పింక్ బాల్ టెస్టు సమయంలో కూడా స్టోక్స్ ఇలాగే చేయడంతో అప్పుడు కూడా అంపైర్లు హెచ్చరించారు. కాగా, కోవిడ్ కారణంగా ఐసీసీ తాత్కాలికంగా ఉమ్మిని బంతికి రుద్దడాన్ని నిషేధించింది. హెచ్చరిక తర్వాత కూడా అలాగే చేస్తే ఎదుటి జట్టుకు 5 పెనాల్టీ పరుగులు లభిస్తాయి.