బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును సాధించాడు. సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అత్యంత వేగంగా 4 వేల పరుగులు, 150 వికెట్లు సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనత 64 టెస్టుల్లో బెన్ స్టోక్స్ సాధించగా, విండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ 63 టెస్టుల్లోనే అందుకున్నాడు. మూడో రోజు ఆటలో విండీస్ బ్యాట్స్‌మన్ అల్జారీ జోసెఫ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో […]
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును సాధించాడు. సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అత్యంత వేగంగా 4 వేల పరుగులు, 150 వికెట్లు సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనత 64 టెస్టుల్లో బెన్ స్టోక్స్ సాధించగా, విండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ 63 టెస్టుల్లోనే అందుకున్నాడు. మూడో రోజు ఆటలో విండీస్ బ్యాట్స్‌మన్ అల్జారీ జోసెఫ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో 150 వికెట్లు అతని ఖాతాలో చేరాయి. తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ 43 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. టెస్టుల్లో ఇప్పటివరకు 4వేల రన్స్, 150 వికెట్లు తీసిన ఆటగాళ్లు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్), కపిల్ దేవ్ (భారత్), జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా), డేనియల్ వెటోరీ (న్యూజిలాండ్) ఈ రికార్డును సాధించారు. ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ సెలవులో ఉండటంతో బెన్ స్టోక్స్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.