ఆ దేశాల్లో ఒక్క కరోనా కేసు లేదు!
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కేసులు మొదలై ఇప్పటికి దాదాపు 8 నెలలు కావస్తోంది. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను నిరోధించడానికి వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 23.5 మిలియన్ల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. 8 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. 15 మిలియన్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, చైనాలో పుట్టిన వైరస్.. దాదాపు […]
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కేసులు మొదలై ఇప్పటికి దాదాపు 8 నెలలు కావస్తోంది. వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌ను నిరోధించడానికి వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 23.5 మిలియన్ల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. 8 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. 15 మిలియన్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, చైనాలో పుట్టిన వైరస్.. దాదాపు 188 దేశాల్లో వ్యాప్తి చెందింది. అయితే, ఇప్పటికీ.. కొన్ని దేశాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
కరోనా కేసులు పట్టణాల నుంచి పల్లెలకు కూడా వ్యాపించడంతో.. ఇప్పుడు అక్కడ కూడా ప్రతి రోజూ మూడు నాలుగు కరోనా కేసులు నమోదవడం పల్లె ప్రజలను కలవరపెడుతోంది. అయితే కొన్ని దేశాల్లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదు కాకపోవడం ఆశ్చర్యకరం. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రపంచంలోని 12కు పైగా దేశాల్లో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఆ దేశాలేంటో తెలుసుకోండి.
1. మార్షల్ ఐలాండ్స్ ( Marshall Islands)
2. సమోవా (samoa)
3. టోంగా (Tonga)
4. వనాటు (vanautu)
5. తువాలు (Tuvalu)
6. సాల్మన్ దీవులు (Solomon Islands)
7. తుర్కెమెనిస్తాన్ (Turkmenistan)
8. నౌరు (Nauru)
9. పలావు (Palau)
10. కిరిబాటి ( kiribati)
11. ఫెడెరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా
12. నార్త్ కొరియా