JOB NOTIFICATION: బీటెక్ చేసి ఉద్యోగం కోసం చూస్తున్నారా..? BEL నోటిఫికేషన్ మీకోసమే..!
దిశ, వెబ్‌డెస్క్ : బీటెక్ చేసి ఉద్యోగాల వేటలో అలసిపోయిన నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) గుడ్ న్యూస్ అందించింది. తమ సంస్థలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అందుకోసం తాజాగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 50 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుందని నోటిఫికేషన్లో ఆ సంస్థ పేర్కొన్నది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ ఉంటుంది. దీనికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి […]
దిశ, వెబ్‌డెస్క్ : బీటెక్ చేసి ఉద్యోగాల వేటలో అలసిపోయిన నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) గుడ్ న్యూస్ అందించింది. తమ సంస్థలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అందుకోసం తాజాగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 50 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుందని నోటిఫికేషన్లో ఆ సంస్థ పేర్కొన్నది. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఏడాది పాటు అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ ఉంటుంది. దీనికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఆగస్టు 29వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎన్ని పోస్టులు..
BEL విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దాని ప్రకారం మెకానికల్ విభాగంలో-20, కంప్యూటర్ సైన్స్ -10, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-10, సివిల్ ఇంజినీరింగ్-10 ఖాళీలు ఉన్నట్టు ప్రకటించారు. ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు రూ.11,110 లను స్కాలర్ షిప్‌గా అందుకోనున్నారు. బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.
క్వాలిఫికేషన్ వివరాలు..
బెల్ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు కొన్ని కండిషన్స్ విధించింది. AICTE లేదా భారత ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 2018 నవంబర్ 30 లోపు బీటెక్ డిగ్రీ కలిగిన వారు సైతం ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే, అభ్యర్థుల వయస్సు 2021 నవంబర్ 30లోగా 25 మించరాదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితి సడలింపు ఉంది. బీఈ/బీటెక్ కోర్సుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల పర్సంటేజ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనుంది.