‘ఎకలాజికల్ యాప్’ ద్వారా నల్లమలలో పులుల గణన ప్రారంభం
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో నల్లమలలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నేషనల్ టైగర్ కన్వెన్షన్ అథారిటీ న్యూఢిల్లీ.. ఆదేశాల ప్రకారం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పెద్ద పులుల గణన ప్రారంభమైంది. అమ్రాబాద్ డివిజన్ పరిధిలోని మన్ననూర్, దోమలపెంట అటవీ పరిధిలో అధికారులు సర్వేను చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు ప్రభాకర్, రవి మోహన్ భట్ మాట్లాడుతూ.. ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి(ఆల్ ఇండియా టైగర్ సెన్సెస్) ద్వారా పెద్ద పులుల గణన […]
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో నల్లమలలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నేషనల్ టైగర్ కన్వెన్షన్ అథారిటీ న్యూఢిల్లీ.. ఆదేశాల ప్రకారం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పెద్ద పులుల గణన ప్రారంభమైంది. అమ్రాబాద్ డివిజన్ పరిధిలోని మన్ననూర్, దోమలపెంట అటవీ పరిధిలో అధికారులు సర్వేను చేపట్టారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రభాకర్, రవి మోహన్ భట్ మాట్లాడుతూ.. ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి(ఆల్ ఇండియా టైగర్ సెన్సెస్) ద్వారా పెద్ద పులుల గణన జరుగుతోందని అన్నారు. 2018లో జరిగిన లెక్కింపు అనంతరం 2021-22లో గణన కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్‌టీసీఏ(National Tiger Conservation Authority) సూచనల మేరకు ప్రత్యేకంగా ఎకలాజికల్ యాప్ ద్వారా కార్డియో సర్వే చేపడుతున్నామని తెలిపారు.
ప్రతీ బీట్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని పదిహేను కిలోమీటర్లు కాలినడక ద్వారా సర్వే చేపడుతూ తగిన ఆధారాలను సేకరిస్తామని తెలిపారు. ఈ సర్వేకు సంబంధించి మద్దిమడుగు అధికారి ఆధిత్య బంధీపూర్‌లో ప్రత్యేక శిక్షణ పొందాడని అన్నారు. గణన విషయంలో అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించామని తెలిపారు.
ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వే..
నేడు అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న పెద్దపులి, ఇతర మాంసాహార జంతువుల లెక్కింపును అటవీశాఖ అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. సర్వే చేస్తున్న అధికారులకు జిల్లా అటవీశాఖ అధికారి కిష్ట గౌడ్.. అచ్చంపేట, అమ్రాబాద్ డివిజన్ల పర్యవేక్షణ అధికారులు రోహిత్ గోపిడి, ఐఎఫ్ఎస్ నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తగిన సూచనలు సలహాలు అందించారు. శాస్త్రీయ పద్ధతిలో ప్రతిష్టాత్మకంగా సర్వే కొనసాగుతోందని తెలిపారు.