లెక్చరర్లకు ‘ డిజిటల్ దిశ’ శిక్షణ ప్రారంభం
దిశ, న్యూస్‌బ్యూరో: జూనియర్ కళాశాలల లెక్చరర్లకు నైపుణ్య శిక్షణకు ఉద్దేశించిన ‘డిజిటల్ దిశ’ మంగళవారం ప్రారంభమయింది. 12బ్యాచ్‌ల్లో 5,300 మంది లెక్చరర్లకు డిజిటల్ బోధన పద్ధతులు, టెక్నాలజీ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్.. సీఎస్ఆర్, నిర్మాణ్ ఎన్జీఓకు ధన్యవాదాలు తెలిపారు. జూనియర్ లెక్చరర్లకు డిజిటల్ పాఠ్యాంశాల్లో శిక్షణ అందడంతో పాటు లక్షల సంఖ్యలో విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేయనుందన్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల లెక్చరర్లు కూడా ఇలాంటి […]
దిశ, న్యూస్‌బ్యూరో: జూనియర్ కళాశాలల లెక్చరర్లకు నైపుణ్య శిక్షణకు ఉద్దేశించిన ‘డిజిటల్ దిశ’ మంగళవారం ప్రారంభమయింది. 12బ్యాచ్‌ల్లో 5,300 మంది లెక్చరర్లకు డిజిటల్ బోధన పద్ధతులు, టెక్నాలజీ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్.. సీఎస్ఆర్, నిర్మాణ్ ఎన్జీఓకు ధన్యవాదాలు తెలిపారు. జూనియర్ లెక్చరర్లకు డిజిటల్ పాఠ్యాంశాల్లో శిక్షణ అందడంతో పాటు లక్షల సంఖ్యలో విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేయనుందన్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలల లెక్చరర్లు కూడా ఇలాంటి శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ అబ్దుల్ వహీద్, కాగ్నిజెంట్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర మయూర్, శివ, స్వరూప పాల్గొన్నారు.