సిద్దిపేట జిల్లాలో ఎలుగుబంటి సంచారం
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో ఎలుగుబంటి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలోని ఎస్సీ కాలనీలోని పోచమ్మ గుడిలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. శుక్రవారం రాత్రి ఎలుగుబంటి గ్రామంలో సంచరిస్తుండగా గ్రామస్తులు గుర్తించారు. ఆలయం గేట్లు తీసి ఉండడంతో నేరుగా దేవాలయం గర్భగుడిలోకి ఎలుగుబంటి ప్రవేశించగానే గ్రామస్తులు ఆలయ గేట్లకు తాళం వేసి అటవీశాఖ, పోలీసులకు సమాచారం అందించారు. వరంగల్ అటవీశాఖ రెస్క్యూ టీం డీఆర్ఓ బాలకృష్ణ, జూనియర్ వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్ […]
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో ఎలుగుబంటి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలోని ఎస్సీ కాలనీలోని పోచమ్మ గుడిలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. శుక్రవారం రాత్రి ఎలుగుబంటి గ్రామంలో సంచరిస్తుండగా గ్రామస్తులు గుర్తించారు.
ఆలయం గేట్లు తీసి ఉండడంతో నేరుగా దేవాలయం గర్భగుడిలోకి ఎలుగుబంటి ప్రవేశించగానే గ్రామస్తులు ఆలయ గేట్లకు తాళం వేసి అటవీశాఖ, పోలీసులకు సమాచారం అందించారు. వరంగల్ అటవీశాఖ రెస్క్యూ టీం డీఆర్ఓ బాలకృష్ణ, జూనియర్ వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని ఎలుగుబంటికి మత్తు మందు ఇచ్చి జూకు తరలించారు.