ఆస్ట్రేలియాలో సడలింపులు.. తెరుచుకున్న బీచ్‌లు

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే ఆ దేశంతో విమానాల రాకపోకలు నిలిపేసిన మొదటి దేశం ఆస్ట్రేలియా. ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌వోతో ఆస్ట్రేలియా మాటల యుద్ధం కూడా చేసింది. కానీ, తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. అంతే కాకుండా ఆరు నెలలపాటు విదేశీయులు దేశంలోకి అడుగుపెట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆస్ట్రేలియాలో చాలా కొద్దిపాటి కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ దేశంలో చాలా కఠినంగా […]

Update: 2020-04-20 03:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే ఆ దేశంతో విమానాల రాకపోకలు నిలిపేసిన మొదటి దేశం ఆస్ట్రేలియా. ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌వోతో ఆస్ట్రేలియా మాటల యుద్ధం కూడా చేసింది. కానీ, తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. అంతే కాకుండా ఆరు నెలలపాటు విదేశీయులు దేశంలోకి అడుగుపెట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆస్ట్రేలియాలో చాలా కొద్దిపాటి కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ దేశంలో చాలా కఠినంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రం మొత్తం మీద ఆరు కేసులే నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రజల నుంచి ప్రభుత్వానికి చాలా విజ్ఞప్తులు వచ్చాయి. ఇండ్లలో ఉండటం వల్ల మానసికంగా కృంగి పోతున్నామని.. కాస్త సడలింపులు ఇవ్వాలని కోరారు. దీంతో సిడ్నీలోని మూడు బీచ్‌లను ప్రభుత్వం తెరిచింది. అక్కడ ప్రసిద్ధి చెందిన కూగీ బీచ్‌కు భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. శని, ఆదివారాలు తెరిచి పెట్టిన బీచ్‌ను సోమవారం మూసేశారు. అయినా సరే సందర్శకులు భారీగానే తరలి వస్తున్నారు. కనీసం 2 మీటర్ల భౌతిక దూరం పాటించాలని.. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రజలు ఆ నిబంధనను పాటిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆ కాస్త వెసులుబాటును వినియోగించుకుంటూ సరదాగా ఒక గంట సేపు బీచ్‌లో గడిపి వెళ్తున్నారు.

tags: Australia, Beaches, leisure, foreigners, corona cases

Tags:    

Similar News