పారిశుద్ధ్య కార్మికులకు అలాంటి సౌకర్యాలు కల్పించాలి

దిశ, ముషీరాబాద్: కరోనా పోరాటంలో ముందుండే పారిశుద్ధ్య కార్మికులకు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కల్పిస్తున్న సదుపాయాలను వర్తింపజేయాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యానగర్ బీసీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో నాలుగు వేల టన్నుల చెత్తను 20 వేల మంది కార్మికులు శుభ్రం చేస్తున్నారన్నారు. కష్టనష్టాలను భరిస్తూ చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వీరి జీతాలు 25 వేలకు పెంచి, […]

Update: 2020-07-26 10:25 GMT

దిశ, ముషీరాబాద్: కరోనా పోరాటంలో ముందుండే పారిశుద్ధ్య కార్మికులకు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కల్పిస్తున్న సదుపాయాలను వర్తింపజేయాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యానగర్ బీసీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో నాలుగు వేల టన్నుల చెత్తను 20 వేల మంది కార్మికులు శుభ్రం చేస్తున్నారన్నారు. కష్టనష్టాలను భరిస్తూ చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వీరి జీతాలు 25 వేలకు పెంచి, బోనస్ సదుపాయం కల్పించాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News