రైతుల ఆందోళనతో అక్కడ ఐపీఎల్ వద్దంటున్నారు..!
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 14వ సీజన్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన వేదికల్లో హైదరాబాద్, ముంబయితో పాటు మొహలీ కూడా లేదు. ముంబయి, హైదరాబాద్‌లలో కరోనా కేసుల కారణంగా ఎంపిక చేయలేదని వార్తలు వచ్చాయి. కానీ, మొహలీ విషయంలో మాత్రం ఎలాంటి కారణం బయటకు రాలేదు. ఒక వేళ కరోనా కారణమైతే ప్రేక్షకులు లేకుండా అయినా నిర్వహింస్తామని పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా కూడా బీసీసీఐని విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ […]
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 14వ సీజన్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన వేదికల్లో హైదరాబాద్, ముంబయితో పాటు మొహలీ కూడా లేదు. ముంబయి, హైదరాబాద్‌లలో కరోనా కేసుల కారణంగా ఎంపిక చేయలేదని వార్తలు వచ్చాయి. కానీ, మొహలీ విషయంలో మాత్రం ఎలాంటి కారణం బయటకు రాలేదు. ఒక వేళ కరోనా కారణమైతే ప్రేక్షకులు లేకుండా అయినా నిర్వహింస్తామని పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా కూడా బీసీసీఐని విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన నిర్వహిస్తున్నారు. గత నవంబర్ నుంచి చేపట్టిన ఆందోళన మరి కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉన్నది. ఐపీఎల్ వేదికగా మొహలీని ఎంపిక చేస్తే.. మ్యాచ్ జరిగే సమయంలో బయట రైతులు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. ఐపీఎల్ వంటి లీగ్స్ సందర్భంగా ఎలాంటి ఆందోళనలు చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్తంగా హైలైట్ అవుతుంది. రైతుల ఆందోళనపై కేంద్రం గుర్రుగా ఉన్న నేపథ్యంలోనే బీసీసీఐ కూడా మొహలీని లిస్టు నుంచి తప్పించినట్లు తెలుస్తున్నది.