మహిళా టీ20 చాలెంజ్ వాయిదా?
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో మహిళల టీ20 చాలెంజ్ ట్రోఫీని బీసీసీఐ గత మూడుసీజన్లుగా నిర్వహిస్తున్నది. మహిళా ఐపీఎల్ ప్రారంభించే ఉద్దేశంతో సన్నాహకంగా టీ20 చాలెంజ్‌ను నిర్వహిస్తున్నది. వాస్తవానికి ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయి ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి కూడా టీ20 చాలెంజ్ నిర్వహిస్తామని ఐపీఎల్ షెడ్యూల్ టైంలో ప్రకటించింది. కాగా, ఐపీఎల్ ప్రారంభమై ఇప్పటికే 20 రోజులు గడిచి పోయినా మహిళా టీ20 […]
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో మహిళల టీ20 చాలెంజ్ ట్రోఫీని బీసీసీఐ గత మూడుసీజన్లుగా నిర్వహిస్తున్నది. మహిళా ఐపీఎల్ ప్రారంభించే ఉద్దేశంతో సన్నాహకంగా టీ20 చాలెంజ్‌ను నిర్వహిస్తున్నది. వాస్తవానికి ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయి ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి కూడా టీ20 చాలెంజ్ నిర్వహిస్తామని ఐపీఎల్ షెడ్యూల్ టైంలో ప్రకటించింది.
కాగా, ఐపీఎల్ ప్రారంభమై ఇప్పటికే 20 రోజులు గడిచి పోయినా మహిళా టీ20 చాలెంజ్‌పై బీసీసీఐ నోరుమెదపడం లేదు. ఈ టోర్నీలో భారత మహిళ క్రికెటర్లతో పాటు పలు దేశాలకు చెందిన 12 మంది విదేశీ ప్లేయర్లు గత సీజన్లో ఆడారు. యూఏఈలో ప్రేక్షకులు లేకుండానే గత ఏడాది టీ20 చాలెంజ్ నిర్వహించారు. అయితే ఈ సారి విదేశీ క్రీడాకారిణులు రావడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పలు దేశాల నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో మహిళా క్రీడాకారిణులు వచ్చే అవకాశం లేదు. అందుకే ఈ ఏడాదికి టీ20 చాలెంజ్‌ను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి అహ్మదాబాద్‌లో ఈ ఏడాది టీ20 చాలెంజ్ నిర్వహించాలనుకున్న బీసీసీఐ కరోనా కారణంగా వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.