టీ20 వరల్డ్ కప్‌పై నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ

దిశ, స్పోర్ట్స్: ఇండియా వేదికగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ఐసీసీ జూన్ 28 వరకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఉన్నతాధికారులు ఈ వారంలో ముంబైలోని ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితి అంచనా వేసి.. టీ20 వరల్డ్ కప్ ఇండియాలోనే నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందో లేదో సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై […]

Update: 2021-06-14 08:38 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియా వేదికగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ఐసీసీ జూన్ 28 వరకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఉన్నతాధికారులు ఈ వారంలో ముంబైలోని ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితి అంచనా వేసి.. టీ20 వరల్డ్ కప్ ఇండియాలోనే నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుందో లేదో సమావేశంలో చర్చించనున్నారు.

ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ముంబై చేరుకొని టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన పన్నుల మినహాయింపుపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. పన్ను మినహాయింపు ఇవ్వకపోతే ఆ భారమంతా బీసీసీఐ భరించాల్సి ఉంటుంది. కాబట్టి భారత ప్రభుత్వంతో ఈ విషయంపై చర్చలు జరిపిన అనంతరం.. బీసీసీఐ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అప్పుడే టీ20 వరల్డ్ కప్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News