IL 2021 : ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడ్డ ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. యూఏఈ వేదికగా ఐపీఎల్ మిగిలిన సీజన్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా పేరుతో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అధ్యక్షతన ఇవాళ బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ వర్చువల్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో ఐపీఎల్ నిర్వహణపై […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడ్డ ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. యూఏఈ వేదికగా ఐపీఎల్ మిగిలిన సీజన్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా పేరుతో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అధ్యక్షతన ఇవాళ బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ వర్చువల్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో ఐపీఎల్ నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.
NEWS 🚨 BCCI to conduct remaining matches of VIVO IPL in UAE.
More details here – https://t.co/HNaT0TVpz1 #VIVOIPL pic.twitter.com/nua3e01RJt
— BCCI (@BCCI) May 29, 2021
సెప్టెంబర్ 18 లేదా 19 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముంది. అక్టోబర్ 9 లేదా 10న ఫైనల్ జరిగే అవకాశముంది. త్వరలోనే షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేయనుంది. కాగా ఇండియాలో సెకండ్ వేవ్ విజృంభించడం, పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడటంతో.. ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.