దుబాయ్ చేరుకున్న గంగూలీ

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (BCCI President Sourav Ganguly) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)నిర్వహణ పర్యవేక్షణ కోసం దుబాయ్ చేరుకున్నారు. బుధవారం ప్రత్యేక విమానంలో ఆయన కోల్‌కతా నుంచి దుబాయ్ వెళ్లారు. ‘ఆరు నెలల తర్వాత ఐపీఎల్ కోసం తొలి సారిగా విమాన ప్రయాణం చేస్తున్నాను. జీవితం చాలా మారిపోయింది’ అంటూ గంగూలీ ఇన్‌స్టాగ్రామ్‌లో విమానం ముందు నిల్చున్న ఫొటోను పోస్టు చేశారు. యూఏఈలో నిర్వహిస్తున్న ఐపీఎల్‌ (IPL)కు సంబంధించిన కార్యాకలాపాలను […]

Update: 2020-09-09 07:11 GMT

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (BCCI President Sourav Ganguly) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)నిర్వహణ పర్యవేక్షణ కోసం దుబాయ్ చేరుకున్నారు. బుధవారం ప్రత్యేక విమానంలో ఆయన కోల్‌కతా నుంచి దుబాయ్ వెళ్లారు. ‘ఆరు నెలల తర్వాత ఐపీఎల్ కోసం తొలి సారిగా విమాన ప్రయాణం చేస్తున్నాను. జీవితం చాలా మారిపోయింది’ అంటూ గంగూలీ ఇన్‌స్టాగ్రామ్‌లో విమానం ముందు నిల్చున్న ఫొటోను పోస్టు చేశారు. యూఏఈలో నిర్వహిస్తున్న ఐపీఎల్‌ (IPL)కు సంబంధించిన కార్యాకలాపాలను బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఆయన పర్యవేక్షించనున్నారు.

గంగూలీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఐపీఎల్ ఇదే. బీసీసీఐ ఇతర ఆటగాళ్లు, సిబ్బంది, అధికారులకు నిర్ధేశించిన ఎస్‌వోపీ (SOP)లను గంగూలీ కూడా పాటిస్తున్నారు. మొఖానికి షీల్డ్ మాస్క్ ధరించి ఆయన దుబాయ్‌లో దిగారు. వెంటనే కరోనా టెస్టులు చేయించుకున్నారు. వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్న తర్వాత ఆయన బీసీసీఐ అధికారులకు ఏర్పాటు చేసిన బయోబబుల్‌ (Bio Bubble)లో ప్రవేశిస్తారు. సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుంది.

Tags:    

Similar News