కొత్త టీ20 సిరీస్‌లు ప్లాన్ చేస్తున్న బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఇండియా వేదికగా జరుగనున్నది. ఈ మెగా టోర్నో కోసం అన్ని దేశాల క్రికెట్ జట్లు సిద్దపడుతున్నాయి. కాగా, టీమ్ ఇండియాకు మాత్రం ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టీ20 తర్వాత వేరే అంతర్జాతీయ మ్యాచ్‌లు లేవు. దాదాపు 7 నెలల పాటు టీమ్ ఇండియా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు దూరంగా ఉండి నేరుగా టీ20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉన్నది. అదే […]
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఇండియా వేదికగా జరుగనున్నది. ఈ మెగా టోర్నో కోసం అన్ని దేశాల క్రికెట్ జట్లు సిద్దపడుతున్నాయి. కాగా, టీమ్ ఇండియాకు మాత్రం ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ టీ20 తర్వాత వేరే అంతర్జాతీయ మ్యాచ్‌లు లేవు. దాదాపు 7 నెలల పాటు టీమ్ ఇండియా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు దూరంగా ఉండి నేరుగా టీ20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉన్నది.
అదే జరిగితే టీమ్ ఇండియాకు ఈ ఫార్మాట్‌లో మ్యాచ్ ప్రాక్టీస్ తక్కువగా ఉంటుంది. దీంతో బీసీసీఐ ఈ మధ్య కాలంలో టీ20 మ్యాచ్‌లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తున్నది. బీసీసీఐతో సన్నిహితంగా ఉండే న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్నది. ఆ రెండు దేశాలతో రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం ప్రతిపాదనలు పంపింది. టీమ్ ఇండియాతో మ్యాచ్‌లు ఆడటం ఆ రెండు దేశాల క్రికెట్ జట్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే ప్రస్తుతం ఐసీసీ ఎఫ్‌టీపీని దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక సారి షెడ్యూల్ పూర్తి చేశాక బీసీసీఐ వెల్లడిస్తుందని ఒక అధికారి తెలిపారు. ఐపీఎల్, డబ్ల్యూటీసీ, ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత ఈ సిరీస్‌లు ఉండే అవకాశం ఉన్నది.