అతి విశ్వాసమే బీసీసీఐ కొంపముంచింది !

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడా ఈవెంట్లకు బ్రేక్ పడింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ 2020తో పాటు ఐపీఎల్, వింబుల్డన్, యూరోపియన్ ప్రీమియర్ లీగ్, ఫ్రెంచ్ ఓపెన్ వంటి టోర్నీలపైనా కరోనా దెబ్బపడింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రతీ ఏటా జరిగే ఈవెంట్లు రద్దు కావడంతో ఆయా క్లబ్బులు, బోర్డులు భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. అయితే కరోనా వంటి ప్రాణాంతక వైరస్ వస్తుందని ఎవరూ ముందుగా ఊహించి ఉండరు. గతంలో ఇలాంటి విపత్తులను చూసి ఎరగని బీసీసీఐ […]

Update: 2020-04-22 05:18 GMT

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడా ఈవెంట్లకు బ్రేక్ పడింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ 2020తో పాటు ఐపీఎల్, వింబుల్డన్, యూరోపియన్ ప్రీమియర్ లీగ్, ఫ్రెంచ్ ఓపెన్ వంటి టోర్నీలపైనా కరోనా దెబ్బపడింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రతీ ఏటా జరిగే ఈవెంట్లు రద్దు కావడంతో ఆయా క్లబ్బులు, బోర్డులు భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. అయితే కరోనా వంటి ప్రాణాంతక వైరస్ వస్తుందని ఎవరూ ముందుగా ఊహించి ఉండరు. గతంలో ఇలాంటి విపత్తులను చూసి ఎరగని బీసీసీఐ కూడా ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ఏడాది పాటు నిరవధికంగా వాయిదా పడటంతో భారీగానే నష్టపోయింది. ఇక ఈ ఏడాదికి పూర్తిగా రద్దయితే కనుక దాదాపు 3500 కోట్ల రూపాయల నష్టం రానుంది.

ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నీ.. వింబుల్డన్ సైతం కరోనా కారణంగానే రద్దయ్యింది. అయితే, గతంలో ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో 17 ఏండ్ల నుంచి ఇన్సూరెన్స్ తీసుకుంటోంది. సార్స్ వైరస్ నుంచి ముప్పు ఉందని భావించి అప్పటి నుంచే వింబుల్డన్‌ను ఇన్సూర్ చేయించారు. అప్పటి నుంచి దాదాపు 34 మిలియన్ డాలర్ల ప్రీమియం చెల్లించారు. వింబుల్డన్‌ వల్ల ఏడాదికి 310 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. కాగా, ప్రస్తుతం రద్దు కావడంతో ఇన్సూరెన్స్ ద్వారా 141 మిలియన్ డాలర్లు (1094 కోట్ల రూపాయలు) ఆల్ ఇంగ్లాండ్ క్లబ్‌కు లభించనున్నాయి. దీంతో తమకు వచ్చే నష్టాలు సగానికి సగం తగ్గిపోవడంతో కాస్త ఉపశమనం లభించింది. కాగా, బీసీసీఐ ఏనాడు ఇలాంటి విపత్తులను ఊహించలేదు. భారత్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దవడం చూశాం.. కానీ ఒక వైరస్ కారణంగా ఏకంగా సిరీస్‌లు, టోర్నీలు రద్దవడం ఇదే మొదటిసారి. దక్షిణాఫ్రికాతో రెండు వన్డేల రద్దుతో పాటు ఐపీఎల్ వాయిదా పడటం వల్ల భారీ నష్టం ఏర్పడింది. వింబుల్డన్, బ్రిటిష్ గోల్ఫ్ ఓపెన్ వంటి ఈవెంట్ల మాదిరిగా ఐపీఎల్ వంటి ఈవెంట్‌కు కూడా పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ చేయించి ఉంటే నష్టాలను గణనీయంగా తగ్గించుకునే వెసులుబాటు ఉండేది. ఇలాంటి విపత్తు ఒకటి వస్తుందనే ముందు చూపు లేకపోవడమే కాకుండా.. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఐపీఎల్‌ను నిర్వహించగలమనే బీసీసీఐ అతివిశ్వాసమే ఇప్పుడు నష్టాలను తెచ్చిపెడుతోందని విశ్లేషకులు అంటున్నారు.

ఇకపై ఐపీఎల్‌తో పాటు ఇండియాలో బీసీసీఐ నిర్వహించే భారీ ఈవెంట్లకు ఇన్సూరెన్స్ చేయిస్తే.. వర్షాలు, వరదల కారణంగా ఆగినా, వైరస్‌ల కారణంగా రద్దయినా కూడా నష్టాల నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని అంటున్నారు. వాయిదా పడిన ఒలంపిక్స్ వల్ల జపాన్ ప్రభుత్వం కూడా భారీగానే నష్టపోవలసి వస్తోంది. కానీ దానికి కూడా బీమా చేయించినట్లు సమాచారం. మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బీమా కంపెనీలకు భారీగానే కెయిమ్స్ అందుతున్నట్లు తెలుస్తోంది.

Tags: Wimbledon, IPL, Olympics, Insurance, BCCI, Corona, Over confidence

Tags:    

Similar News