ఐపీఎల్ మీడియా టెండర్లు మరింత ఆలస్యం
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ టెండర్లు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం స్టార్ ఇండియా దగ్గర ఉన్న హక్కుల గడువు ఐపీఎల్ 2022తో ముగియనున్నది. దీంతో ఈ ఏడాది ఆఖరులోగా కొత్త బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు పూర్తి చేయాలని బీసీసీఐ భావించింది. అయితే ఐపీఎల్‌లో తీసుకున్న రెండు కొత్త టీమ్స్‌లో అహ్మదాబాద్‌కు సంబంధించిన ఓనర్లపై బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఇంకా ఆ జట్టు టెండర్ ఖరారు చేయలేదు. కొత్త జట్టుకు సంబంధించిన డైలమాకు ఇంకా తెరపడకపోవడంతోనే బ్రాడ్ […]
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ టెండర్లు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం స్టార్ ఇండియా దగ్గర ఉన్న హక్కుల గడువు ఐపీఎల్ 2022తో ముగియనున్నది. దీంతో ఈ ఏడాది ఆఖరులోగా కొత్త బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు పూర్తి చేయాలని బీసీసీఐ భావించింది. అయితే ఐపీఎల్‌లో తీసుకున్న రెండు కొత్త టీమ్స్‌లో అహ్మదాబాద్‌కు సంబంధించిన ఓనర్లపై బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఇంకా ఆ జట్టు టెండర్ ఖరారు చేయలేదు. కొత్త జట్టుకు సంబంధించిన డైలమాకు ఇంకా తెరపడకపోవడంతోనే బ్రాడ్ కాస్టింగ్ హక్కుల టెండర్లు ఇంకా పిలవలేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. సీవీసీ కాపిటల్ పార్ట్‌నర్స్‌కు బెట్టింగ్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయనే విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే మీడియా హక్కుల వేలం జరుగుతుందని తెలుస్తున్నది. ఇక కొత్త హక్కుల కోసం ప్రస్తుతం ఉన్న స్టార్ ఇండియాతో పాటు, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్, జీ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్, జియో టీవీ, అమెజాన్ ప్రైమ్ వంటి దిగ్గజ సంస్థలు పోటీ పడనున్నాయి.