టీమ్ ఇండియాలో కీలక మార్పులు

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు ముందు బీసీసీఐ జాతీయ సెలెక్షన్ కమిటీ టీమ్ ఇండియాలో కీలక మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన జట్టులోనే చిన్న మార్పు చేసింది. స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న శార్దుల్ ఠాకూర్‌ను ప్రధాన జట్టులోకి తీసుకొని.. ప్రధాన జట్టులోని అక్షర్ పటేల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా మార్పు చేసింది. టీ20 వరల్డ్ కప్‌లో శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్‌తో పాటు అక్షర్ పటేల్ కూడా ఇప్పుడు స్టాండ్ […]

Update: 2021-10-13 09:48 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు ముందు బీసీసీఐ జాతీయ సెలెక్షన్ కమిటీ టీమ్ ఇండియాలో కీలక మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన జట్టులోనే చిన్న మార్పు చేసింది. స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న శార్దుల్ ఠాకూర్‌ను ప్రధాన జట్టులోకి తీసుకొని.. ప్రధాన జట్టులోని అక్షర్ పటేల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా మార్పు చేసింది. టీ20 వరల్డ్ కప్‌లో శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్‌తో పాటు అక్షర్ పటేల్ కూడా ఇప్పుడు స్టాండ్ బై ప్లేయర్‌గా ఉండనున్నాడు. ఇక టీమ్ ఇండియా బయోబబుల్‌లో మరో 8 మంది ప్రవేశించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మన్ మేరీవాలా, వెంకటేశ్ అయ్యర్, కరణ్ శర్మ, షాబాజ్అహ్మద్, క్రిస్ణప్ప గౌతమ్‌లు నెట్ బౌలర్లుగా భారత జట్టు వెంటే ఉండనున్నారు. ఇక హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తప్పిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి సూచనలు రాకపోవడంతో బీసీసీఐ భారీ మార్పులు ఏవీ చేయలేదు. అయితే శార్దుల్ ఠాకూర్‌ను పాండ్యా స్థానంలోనే తీసుకున్నట్లు తెలుస్తున్నది. బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరం ఉన్నందునే ఠాకూర్‌కు ప్రమోషన్ ఇచ్చినట్లు సమాచారం.

టీమ్ ఇండియా : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి

స్టాండ్ బై : శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్

Tags:    

Similar News