కొవిడ్ ప్రోటోకాల్స్ విస్మరించొద్దు.. బీసీసీఐ హెచ్చరిక

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్ 19నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు యూఏఈ బాట పడుతున్నాయి. అందరి కంటే ముందుగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు యూఏఈ చేరుకున్నాయి. మిగిలిన జట్లు కూడా మరో మూడు రోజుల్లో చేరుకోనున్నాయి. కాగా, యూఏఈలో కొవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండటంతో బీసీసీఐ ఆందోళన చెందుతున్నది. ఐపీఎల్‌లో ఆటగాళ్లెవరూ కొవిడ్-19 ప్రోటోకాల్స్ విస్మరించొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ‘ఐపీఎల్‌లో పాల్గొనే […]

Update: 2020-08-20 10:57 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్ 19నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు యూఏఈ బాట పడుతున్నాయి. అందరి కంటే ముందుగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు యూఏఈ చేరుకున్నాయి. మిగిలిన జట్లు కూడా మరో మూడు రోజుల్లో చేరుకోనున్నాయి. కాగా, యూఏఈలో కొవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండటంతో బీసీసీఐ ఆందోళన చెందుతున్నది.

ఐపీఎల్‌లో ఆటగాళ్లెవరూ కొవిడ్-19 ప్రోటోకాల్స్ విస్మరించొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ‘ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సహాయక సిబ్బంది, యజమానులు, ఇతర సభ్యులు అందరికీ కఠినమైన సూచనలు జారీ చేశాము. ఒకరి తప్పు వల్ల మిగతా సభ్యులు ప్రమాదంలో పడకూడదు. కాబట్టి ఐపీఎల్ జరుగుతున్నన్ని రోజులూ బీసీసీఐ ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటించాల్సిందే’ అని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

Tags:    

Similar News