టీం ఇండియా కిట్ స్పాన్సర్ కోసం టెండర్లు
దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా కిట్ స్పాన్సర్ నైక్ గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము బీసీసీఐ ఒప్పందాన్ని కొనసాగించలేమంటూ 14 ఏళ్ల బంధానికి వీడ్కోలు పలికింది. దీంతో బీసీసీఐ తాజాగా టెండర్లు పిలిచింది. నైక్ నాలుగేళ్ల కిందట రూ.370కోట్ల డీల్ కుదుర్చుకుంది. దీంట్లో రూ.30 కోట్లు రాయల్టీ కింద చెల్లించాలి. అయితే నైక్ ఇక ఒప్పందానికి వచ్చే నెలాఖరుతో గుడ్‌బై చెప్పనుండటంతో టీం కిట్ స్పాన్సర్, మర్కండైజ్ పార్ట్‌నర్ కోసం సోమవారం బీసీసీఐ తాజాగా […]
దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా కిట్ స్పాన్సర్ నైక్ గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము బీసీసీఐ ఒప్పందాన్ని కొనసాగించలేమంటూ 14 ఏళ్ల బంధానికి వీడ్కోలు పలికింది. దీంతో బీసీసీఐ తాజాగా టెండర్లు పిలిచింది. నైక్ నాలుగేళ్ల కిందట రూ.370కోట్ల డీల్ కుదుర్చుకుంది. దీంట్లో రూ.30 కోట్లు రాయల్టీ కింద చెల్లించాలి. అయితే నైక్ ఇక ఒప్పందానికి వచ్చే నెలాఖరుతో గుడ్‌బై చెప్పనుండటంతో టీం కిట్ స్పాన్సర్, మర్కండైజ్ పార్ట్‌నర్ కోసం సోమవారం బీసీసీఐ తాజాగా టెండర్లు పిలిచింది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఈ టెండర్లకు ఓకే చెప్పడంతో ఆగస్టు 3నుంచి రూ.1లక్ష ధరావతు చెల్లించి దరఖాస్తు పెట్టాల్సి ఉంది. ఆగస్టు 26లోపు వీటిని బీసీసీఐ మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌కు ఈమెయిల్ చేయవచ్చని ఒక అధికారి స్పష్టం చేశారు.