టీఎన్‌పీఎల్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

దిశ, స్పోర్ట్స్: తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2021కి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా గత ఏడాది టీఎన్‌పీఎల్‌ను రద్దు చేశారు. అయితే ఈ ఏడాది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేయడంతో బీసీసీఐ ఆ మేరకు అనుమతి మంజూరు చేసింది. జూన్ 4 నుంచి జులై 4 వరకు తమిళనాడులోని తిరునల్వేలి, దిండిగల్, సేలమ్, కోయంబత్తూర్ వేదికలుగా ఈ లీగ్ నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో సేలమ్ స్పార్టన్స్, లైకా కోవాయ్ కింగ్స్, […]

Update: 2021-05-15 09:43 GMT

దిశ, స్పోర్ట్స్: తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2021కి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా గత ఏడాది టీఎన్‌పీఎల్‌ను రద్దు చేశారు. అయితే ఈ ఏడాది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేయడంతో బీసీసీఐ ఆ మేరకు అనుమతి మంజూరు చేసింది. జూన్ 4 నుంచి జులై 4 వరకు తమిళనాడులోని తిరునల్వేలి, దిండిగల్, సేలమ్, కోయంబత్తూర్ వేదికలుగా ఈ లీగ్ నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో సేలమ్ స్పార్టన్స్, లైకా కోవాయ్ కింగ్స్, చేపాక్ సూపర్ గిల్లీస్, మధురై పాంథర్స్, త్రిచ్చీ వారియర్స్, నెల్లాయ్ రాయల్ కింగ్స్, దిండిగల్ డ్రాగన్స్, ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిళన్స్ జట్లు పాల్గొంటున్నాయి.

టీఎన్‌పీఎల్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన చేపాక్ సూపర్ గిల్లీస్ ఈ సారి కూడా ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. టీఎన్‌పీఎల్‌లో ఇప్పటి వరకు 4 సీజన్లు జరగ్గా గత ఏడాది రద్దయ్యింది. ప్రస్తుతం జరగబోయేది 5వ సీజన్ కావడం గమనార్హం.

Tags:    

Similar News