బీసీసీఐ తాత్కాలిక సీఈఓగా హేమంగ్

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాత్కాలిక సీఈఓగా హేమంగ్ అమీన్ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా ఉన్నారు. ఇటీవల సీఈఓ రాహుల్ జోహ్రీని పదవి నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాత్కాలిక సీఈఓగా హేమంగ్‌ను నియమించారు. త్వరలో కొత్త సీఈఓ నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటివరకు హేమంగ్‌కు […]

Update: 2020-07-14 05:48 GMT

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాత్కాలిక సీఈఓగా హేమంగ్ అమీన్ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా ఉన్నారు. ఇటీవల సీఈఓ రాహుల్ జోహ్రీని పదవి నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాత్కాలిక సీఈఓగా హేమంగ్‌ను నియమించారు. త్వరలో కొత్త సీఈఓ నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటివరకు హేమంగ్‌కు తాత్కాలిక సీఈఓ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు బోర్డు సభ్యులకు, అనుబంధ అసోసియేషన్లకు బీసీసీఐ కార్యదర్శి జై షా సమాచారం అందించారు. మొదటి సీఈఓ నియామకంలో బీసీసీఐ కన్సల్టింగ్ ఏజెన్సీ కార్న్ ఫెర్రీ సహాయం కోరింది. ఈసారి బోర్డు ఏ ఏజెన్సీ సహాయం లేకుండా సొంతంగా నియమించుకునే అవకాశం ఉంది. కొత్త సీఈఓకి రాహుల్‌ జోహ్రీకి ఉన్న స్థాయిలో పారితోషికం ఉండకపోవచ్చని తెలుస్తున్నది

Tags:    

Similar News