చివరి రెండు టెస్టులకు భారత జట్టులో కీలక మార్పులు

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరుగనున్న చివరి రెండు టెస్టులకు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టులో శార్దుల్ ఠాకూర్‌కు చోటు దక్కలేదు. ఇతడిని విజయ్ హజారే ట్రోఫీ కోసం తప్పించారు. ఇక స్టాండ్‌బై ప్లేయర్ షాబాజ్ నదీమ్ జట్టులో స్థానం సంపాదించలేకోయాడు. ప్రస్తుతం 1-1తో సిరీస్ సమంగా నిలిచింది. కాగా, మిగిలిన రెండు టెస్టులు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో నిర్వహించనున్నారు. దీనిలో 3వ టెస్టు పింక్ బాల్ (డే/నైట్) టెస్టు […]

Update: 2021-02-17 08:08 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరుగనున్న చివరి రెండు టెస్టులకు టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టులో శార్దుల్ ఠాకూర్‌కు చోటు దక్కలేదు. ఇతడిని విజయ్ హజారే ట్రోఫీ కోసం తప్పించారు. ఇక స్టాండ్‌బై ప్లేయర్ షాబాజ్ నదీమ్ జట్టులో స్థానం సంపాదించలేకోయాడు. ప్రస్తుతం 1-1తో సిరీస్ సమంగా నిలిచింది. కాగా, మిగిలిన రెండు టెస్టులు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో నిర్వహించనున్నారు. దీనిలో 3వ టెస్టు పింక్ బాల్ (డే/నైట్) టెస్టు కాగా చివరిది సాధారణ టెస్టు. పింక్ బాల్ టెస్టు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నది.

టీమ్ ఇండియా స్వ్కాడ్ :

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజార, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహ, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

స్టాండ్ బై : కేఎస్ భరత్, రాహుల్ చాహర్

Tags:    

Similar News