ఒలింపిక్ అథ్లెట్లకు గుడ్‌న్యూస్.. BCCI భారీ నజరానా

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన భారత అథ్లెట్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఇప్పటికే ఆయా ప్లేయర్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైజ్ మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు రూ.1కోటి ఇవ్వనున్నట్టు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ జై షా తెలిపారు. సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చాను, రమికుమార్ దహియాకు ఒక్కొక్కరికి రూ.50లక్షలు చెల్లిస్తామన్నారు. ఇక కాంస్యం సాధించిన పీవీ సింధు, లవ్లీనా, భజ్ రంగ్ […]

Update: 2021-08-07 11:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన భారత అథ్లెట్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఇప్పటికే ఆయా ప్లేయర్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైజ్ మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు రూ.1కోటి ఇవ్వనున్నట్టు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ జై షా తెలిపారు.

సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చాను, రమికుమార్ దహియాకు ఒక్కొక్కరికి రూ.50లక్షలు చెల్లిస్తామన్నారు. ఇక కాంస్యం సాధించిన పీవీ సింధు, లవ్లీనా, భజ్ రంగ్ పూనియాలకు రూ.25 లక్షల చొప్పున.. పురుషుల హాకీ జట్టుకు మాత్రం రూ.1.25 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

Tags:    

Similar News