మరో వివాదానికి తెరలేపిన బీసీఏ

దిశ, స్పోర్ట్స్ : బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) మరో వివాదానికి తెరలేపింది. బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాష్ట్ర స్థాయి టీ20 లీగ్‌ నిర్వహించడానికి సిద్దపడింది. పాట్నాలో మార్చి 21 నుంచి 27 వరకు నిర్వహించనున్న ఈ లీగ్‌లో మొత్తం 5 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అంగిక అవెంజర్స్, భాగల్‌పూర్ బుల్స్, ధర్భంగా డైమండ్స్, గయ గ్లాడియేటర్స్, పాట్నా పైలట్స్ ఫ్రాంచైజీలకు సంబంధించి శనివారం ఆటగాళ్ల వేలంపాట కూడా నిర్వహించారు. ప్రతీ ఆటగాడికి రూ. 50 […]

Update: 2021-03-01 10:43 GMT

దిశ, స్పోర్ట్స్ : బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) మరో వివాదానికి తెరలేపింది. బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాష్ట్ర స్థాయి టీ20 లీగ్‌ నిర్వహించడానికి సిద్దపడింది. పాట్నాలో మార్చి 21 నుంచి 27 వరకు నిర్వహించనున్న ఈ లీగ్‌లో మొత్తం 5 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అంగిక అవెంజర్స్, భాగల్‌పూర్ బుల్స్, ధర్భంగా డైమండ్స్, గయ గ్లాడియేటర్స్, పాట్నా పైలట్స్ ఫ్రాంచైజీలకు సంబంధించి శనివారం ఆటగాళ్ల వేలంపాట కూడా నిర్వహించారు. ప్రతీ ఆటగాడికి రూ. 50 వేల రూపాయల కనీస ధర నిర్ణయించి ఈ వేలం కొనసాగింది. ఐపీఎల్, ఇతర లీగ్స్‌లో సెలెక్ట్ కాని వారిని కూడా ఈ లీగ్‌లో వేలం వేశారు.

కాగా, బీసీఏ వేలం నిర్వహించడంపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది. తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లలో స్పాట్ ఫిక్సింగ్ ఘటనలు వెలుగు చూడటంతో బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ రాష్ట్రాల లీగ్‌లకు అనుమతులు మంజూరు చేయవద్దని సిఫార్సు చేసింది. నెల క్రితమే బీసీసీఐని బీహార్ క్రికెట్ అసోసియేషన్ తగిన అనుమతులు కోరినా.. ఏసీయూ ఆంక్షల నేపథ్యంలో అనుమతులు ఇవ్వలేమని తెలసింది. అయితే నెల క్రితమే అనుమతలు కోరుతూ బీసీసీఐకి లేఖ రాశామని.. కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మేం వేలం నిర్వహించామని బీసీఏ అధ్యక్షుడు రాకేశ్ తివారి పేర్కొన్నారు. ఎలైట్ స్పోర్ట్స్ అనే సంస్థతో జతకలిసి బీసీఏ ఈ లీగ్ నిర్వహిస్తున్నది. అనుమతులు అడిగినట్లు బీసీఏ చెప్పిన తర్వాతే మేము వేలం పాట నిర్వహించామని ఎలైట్ స్పోర్ట్స్ చెబుతున్నది.

Tags:    

Similar News