ఆ భూములు అన్యక్రాంతం చేస్తే ఊరుకోం..

దిశ, హన్మకొండ: బీసీ కులాలకు కేటాయించిన భూమిలో ఒక్క గుంట భూమిని అన్యాక్రాంతం చేసిన ఊరుకునేది లేదని, ప్రభుత్వ అధికారులు సర్వేను వెంటనే ఉపసంహరించుకొని ఆ భూమిని బీసీలకే కేటాయించాలని వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామంలో బీసీ కులాలకు ప్రభుత్వం కేటాయించిన భూములను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మర్రిపల్లి గూడెంలో కోటి […]

Update: 2020-07-10 05:54 GMT

దిశ, హన్మకొండ: బీసీ కులాలకు కేటాయించిన భూమిలో ఒక్క గుంట భూమిని అన్యాక్రాంతం చేసిన ఊరుకునేది లేదని, ప్రభుత్వ అధికారులు సర్వేను వెంటనే ఉపసంహరించుకొని ఆ భూమిని బీసీలకే కేటాయించాలని వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామంలో బీసీ కులాలకు ప్రభుత్వం కేటాయించిన భూములను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మర్రిపల్లి గూడెంలో కోటి వరాల పథకం కింద 2001లో 20 మంది బీసీ కులాలకు సర్వే నెంబర్ 824/A, 825, 826/A, 833/A, 833/B, లలో 6 ఎకరాల 3 గుంటల భూమిని కేటాయించినట్టు వివరించారు. ఈ భూమిని ఇరవై ఏళ్ల నుంచి బీసీ కులస్తులు కాపాడుతూ వస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ భూమిని రైతు వేదిక కోసం కేటాయిస్తున్నామని ప్రభుత్వ అధికారులు సర్వే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే తమ ప్రయత్నాలు విరమించుకోవాలని లేని పక్షంలో జిల్లా, రాష్ట్ర, వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News