సెల్‌ఫోన్ లైట్ల నడుమ బతుకమ్మ వేడుకలు
దిశ, తొర్రూరు: మండలంలోని పోలెపల్లి గ్రామంలో సర్పంచ్ బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో మహిళలు చీకట్లో సెల్ ఫోన్ల లైట్లు పెట్టుకొని బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఇతర ఏర్పాట్లుకు నిధులు కేటాయించినా ఏ ఒక్క ఏర్పాటు కూడా చేయలేదని చర్చించుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతుందని వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే కనీస ఏర్పాట్లు చేయకున్నా.. చేసినట్టు బిల్లులు పెట్టుకొని డబ్బులు లాగేస్తున్నారని […]
దిశ, తొర్రూరు: మండలంలోని పోలెపల్లి గ్రామంలో సర్పంచ్ బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో మహిళలు చీకట్లో సెల్ ఫోన్ల లైట్లు పెట్టుకొని బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఇతర ఏర్పాట్లుకు నిధులు కేటాయించినా ఏ ఒక్క ఏర్పాటు కూడా చేయలేదని చర్చించుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతుందని వాపోతున్నారు. ఇది ఇలా ఉంటే కనీస ఏర్పాట్లు చేయకున్నా.. చేసినట్టు బిల్లులు పెట్టుకొని డబ్బులు లాగేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చీకట్లో బతుకమ్మ ఆడుకోలేక వెంటనే నిమజ్జనం చేసి వెళ్లాల్సి వస్తోందని మహిళలు గ్రామ సర్పంచ్ పై మండిపడ్డారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మిగిలిన రోజుల్లో అయినా లైటింగ్, సైండ్ సిస్టమ్ ఏర్పాట్లు చేయించాలని వేడుకుంటున్నారు.