IOS యూజర్స్‌కు అందుబాటులో ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్’
దిశ, ఫీచర్స్ : భారత ప్రభుత్వం పబ్‌జీపై నిషేధం విధించిన ఏడాది తర్వాత.. ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్(బీజీఎమ్ఐ)’ పేరుతో జూలై 2వ తేదీన లాంచ్ అయిన విషయం తెలిసిందే. గూగుల్ ప్లే స్టోర్‌లో విడుదల చేసిన వారంలోనే 3 కోట్ల 40 లక్షల రిజిస్టర్డ్ యూజర్లతో కొత్త రికార్డులు సృష్టించింది. కాగా ఇప్పటివరకు ఆండ్రాయిడ్ యూజర్లకే పరిమితమైన ఈ గేమ్.. తాజాగా ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు గేమ్ డౌన్‌లోడ్ చేసుకుని రివార్డ్ పాయింట్స్ […]
దిశ, ఫీచర్స్ : భారత ప్రభుత్వం పబ్‌జీపై నిషేధం విధించిన ఏడాది తర్వాత.. ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్(బీజీఎమ్ఐ)’ పేరుతో జూలై 2వ తేదీన లాంచ్ అయిన విషయం తెలిసిందే. గూగుల్ ప్లే స్టోర్‌లో విడుదల చేసిన వారంలోనే 3 కోట్ల 40 లక్షల రిజిస్టర్డ్ యూజర్లతో కొత్త రికార్డులు సృష్టించింది. కాగా ఇప్పటివరకు ఆండ్రాయిడ్ యూజర్లకే పరిమితమైన ఈ గేమ్.. తాజాగా ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు గేమ్ డౌన్‌లోడ్ చేసుకుని రివార్డ్ పాయింట్స్ పొందవచ్చని ఐఫోన్ యూజర్లకు సూచించారు మేకర్స్.
‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ గేమ్‌ను మొదట ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘ఓపెన్-టు-ఆల్ ఎర్లీ యాక్సెస్’ వెర్షన్‌గా తీసుకొచ్చిన డెవలపర్స్.. తర్వాత స్టేబుల్ వెర్షన్‌ను విడుదల చేశారు. అప్పటి నుంచి గేమ్ డౌన్‌లోడ్ గ్రాఫ్ పెరుగుతుండగా.. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో 50 మిలియన్ డౌన్‌లోడ్స్‌ను దాటింది. ఈ నేపథ్యంలో క్రాఫ్టన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు రివార్డులను ప్రకటించింది. మైల్‌స్టోన్ పూర్తయిన తర్వాత మొబైల్ ఇండియా ప్లేయర్స్ అందరూ రివార్డ్ స్వీకరించేందుకు అర్హులని డెవలపర్స్ తెలిపారు. కొన్ని వారాల తర్వాత రివార్డ్‌ల గడువు ముగుస్తుందని, అందువల్ల వినియోగదారులు గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, గడువుకు ముందే రివార్డులను పొందాలని సూచించారు.
ఇందులో భాగంగా.. గెలాక్సీ మెసెంజర్ సెట్ దుస్తులను పర్మినెంట్ రివార్డ్‌గా పొందుతారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లేయర్స్ రివార్డ్‌ల రూపంలో క్లాసిక్ కూపన్ క్రాట్ స్క్రాప్ త్రీ పీసెస్ పొందవచ్చు. రివార్డ్‌లు గేమ్ ఈవెంట్స్ విభాగంలో అందుబాటులో ఉంటాయి. ఇక ఐవోఎస్ వినియోగదారులకు సైన్-అప్ రివార్డులను కూడా కంపెనీ ప్రకటించింది. యాప్ స్టోర్‌లో గేమ్ 1 మిలియన్‌ను తాకిన తర్వాత ఆటగాళ్లకు రెండు సప్లై క్రాట్ కూపన్ లభిస్తాయని.. గేమ్ 5 మిలియన్,10 మిలియన్ డౌన్‌లోడ్ మార్కును దాటిన తర్వాత క్లాసిక్ క్రేట్ కూపన్, కానిస్టేబుల్ సెట్‌ను అందిస్తామని క్రాఫ్టన్ పేర్కొంది.