ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

దిశ, వెబ్‌డెస్క్: మన సంస్కృతి సంప్రదాయాలను నిలుపుకోవడంతో పాటు, ఆచార వ్యవహరాలనూ కొనసాగించాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతీ ఒక్కరిపై ఉందని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌ నగరంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో శనివారం మంత్రి జగదీశ్ రెడ్డి ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. జూమ్ యాప్ ద్వారా మంత్రి వేడుకలను వీక్షించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ గత ఏడేండ్లుగా […]

Update: 2020-10-24 03:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: మన సంస్కృతి సంప్రదాయాలను నిలుపుకోవడంతో పాటు, ఆచార వ్యవహరాలనూ కొనసాగించాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతీ ఒక్కరిపై ఉందని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌ నగరంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో శనివారం మంత్రి జగదీశ్ రెడ్డి ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. జూమ్ యాప్ ద్వారా మంత్రి వేడుకలను వీక్షించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ గత ఏడేండ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా మంచి పద్ధతుల్లో కొనసాగుతున్నాయని అభినందించారు.

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రవాస భారతీయులు మన దేశ, ప్రాంత పునాదిని మర్చిపోకుండా మన సంస్కృతీ, సంప్రదాయాలను కొనసాగించాలాని మంత్రి తెలిపారు. మనసాంస్కృతిక వారసత్వ పండుగ అయిన బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి అనిల్‌తో పాటు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. లక్షలాది మంది ఒక చోట చేరి చేసుకునే సామూహిక ఉత్సవాలైన బతుకమ్మ, దసరా పండగలను ఈసారి కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఎవరి ఇళ్లలో వారే చేసుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News