రాయల్స్ హోమ్.. ‘బర్సపారా!’
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన, ఖరీదైన ఆటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒకటి. మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా క్రికెట్ లీగ్ కోసం ప్రస్తుతం ఫ్రాంచైజీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. సాధారణంగా ఐపీఎల్ జట్లన్నీ హోమ్‌గ్రౌండ్‌లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతుంటాయి. కొన్నిసార్లు ఆయా జట్ల యాజమన్యాలు.. వేరే ప్రాంతంలోని గ్రౌండ్స్‌ను కూడా తమ హోమ్ గ్రౌండ్‌గా మార్చుకుంటుంటాయి. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ విషయంలోనూ అదే జరగబోతోంది. నిజానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు హోమ్ […]
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన, ఖరీదైన ఆటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒకటి. మార్చి 29 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా క్రికెట్ లీగ్ కోసం ప్రస్తుతం ఫ్రాంచైజీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. సాధారణంగా ఐపీఎల్ జట్లన్నీ హోమ్‌గ్రౌండ్‌లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతుంటాయి. కొన్నిసార్లు ఆయా జట్ల యాజమన్యాలు.. వేరే ప్రాంతంలోని గ్రౌండ్స్‌ను కూడా తమ హోమ్ గ్రౌండ్‌గా మార్చుకుంటుంటాయి. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ విషయంలోనూ అదే జరగబోతోంది.
నిజానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు హోమ్ గ్రౌండ్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం. కానీ, ఈ స్టేడియం కెపాసిటీ కేవలం 30 వేలే కావడంతో గతంలోనూ ఆ జట్టు తమ హోమ్ మ్యాచులను ఇతర స్టేడియాల్లో ఆడింది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లో, నవీముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో చాలా మ్యాచ్‌లు ఆడింది. తాజాగా అస్సాం రాజధాని గువాహటిలోని ‘బర్సపారా’ స్టేడియాన్నీ తమ హోమ్ గ్రౌండ్‌గా నమోదు చేసుకుంది. ఇక్కడ రెండు హోమ్ మ్యాచ్‌లను ఆడాలని రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం నిర్ణయించింది.
ఏప్రిల్ 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్, ఏప్రిల్ 9న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లనును రాజస్థాన్ రాయల్స్ గువాహటిలో ఆడనుంది. త్రివేండ్రం, లక్నో, ముంబై, అహ్మదాబాద్ స్టేడియాల్లో ఆడాలని ఆర్ఆర్ యాజమాన్యం ప్రయత్నించినా.. చివరకు గువాహటిలో ఆడాలని నిర్ణయించుకుంది.