ఆ చిన్నోడికి… ఓ పోలీస్ అధికారి పేరు
దిశ వెబ్ డెస్క్: కరోనా కట్టడి చేయడానికి.. దేశమంతా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో… ఎంతోమంది అనాథలు, భిక్షగాళ్లు, కూలీలు అవస్థలు పడుతున్నారు. రక్షక భటులు నిజంగానే… పౌరులకు రక్షణగా ఉంటూ… తమ ఔదార్యాన్ని కూడా చాటుకుంటున్నారు. ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న ఎంతోమందికి అన్నం పెట్టి ఆదుకున్నారు. సాయం కావాలన్నా వారికి చేతనైన సాయం చేస్తున్నారు. మరో వైపు.. అందరూ తమ తమ ఇల్లలో ఉంటే… వారు మాత్రం కుటుంబాలకు దూరంగా ఉంటూ.. విధులు […]
దిశ వెబ్ డెస్క్: కరోనా కట్టడి చేయడానికి.. దేశమంతా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో… ఎంతోమంది అనాథలు, భిక్షగాళ్లు, కూలీలు అవస్థలు పడుతున్నారు. రక్షక భటులు నిజంగానే… పౌరులకు రక్షణగా ఉంటూ… తమ ఔదార్యాన్ని కూడా చాటుకుంటున్నారు. ఇప్పటికే ఆకలితో అలమటిస్తున్న ఎంతోమందికి అన్నం పెట్టి ఆదుకున్నారు. సాయం కావాలన్నా వారికి చేతనైన సాయం చేస్తున్నారు. మరో వైపు.. అందరూ తమ తమ ఇల్లలో ఉంటే… వారు మాత్రం కుటుంబాలకు దూరంగా ఉంటూ.. విధులు నిర్వర్తిస్తున్నారు. ఆపత్కాలంలో ఎంతో కృషి చేస్తున్నారు పోలీసులు. ఇలాంటి సమయంలోనే .. ఓ పోలీస్ ఉన్నతాధికారి మానవత్వంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న ఓ గర్భిణిని చేరుకోవడానికి… తన భర్తకు సాయమందించాడు. దాంతో తనకు పుట్టిన బిడ్డకు ఆ పోలీస్ అధికారి పేరు పెట్టుకున్నారు. మానవత్వానికి ఏవీ అడ్డురావని నిరూపించే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
దేశం మొత్తం లాక్ డౌన్ తో ఎక్కడి వారు అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తమన్నా అలీ ఖాన్ అనే మహిళా బరేలీలో నివసిస్తున్నారు. కాగా.. తన భర్త అనీజ్ ఖాన్ పని మీద నోయిడా వెళ్లాడు.. లాక్ డౌన్ నేపథ్యంలో నోయిడాలోనే ఉండి పోవాల్సి వచ్చింది. అప్పటికే ఆమెకు నెలలు నిండాయి. ఏం చేయాలో ఆమెకు అర్థం కావడం లేదు. భర్త పక్కన లేడు. బయట చూస్తే.. దుకాణాలు తెరిచిలేవు. రవాణా సౌకర్యం కూడా అందుబాటులో లేదు. తన స్థితిని తెలియజేస్తూ.. బరేలీ పోలీసులకు ఓ వీడియో మెసేజ్ పంపించింది తమన్నా.
వీడియోలో.. ఏం చెప్పిందంటే:
‘నేను గర్భిణీని..పురిటినొప్పులు వస్తున్నాయి. నా భర్తను చూడాలనుంది. తన నా దగ్గర లేడు. నన్ను ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి ఎవరూ లేరు. ఎలాగైనా నా భర్తను నా దగ్గరకు చేర్చండి’ అంటూ తమన్నా పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంది. ఆ వీడియోకు స్పందించిన అధికారులు.. నోయిడా ఏడీసీపీ రణ్ విజయ్ సింగ్ ను సంప్రదించారు. ఆయన స్పందించి.. అనీజ్ ఖాన్ బరేలీ చేరేందుకు ఓ వాహనాన్ని ఏర్పాటు చేశారు.
పోలీసులు రియల్ హీరోలు:
సరైన సమయంలో.. అనీజ్ బరేలీ చేరుకోవడంతో… తమన్నాను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అంతా సవ్యంగా జరగడంతో.. ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన బిడ్డకు, తనకు పునర్జన్మ అందించిన ఆ పోలీస్ అధికారికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంది. అంతేకాదు.. తమ బిడ్డకు ఆ అధికారి పేరే పెట్టుకుంది. ఇందుకు సంబంధించి మరో వీడియో చేసింది తమన్నా. ‘‘నిజానికి సోషల్ మీడియాలో వీడియో మెసేజ్ పెట్టడం వల్ల.. నాకు సహాయం లభిస్తుందని ఏ మాత్రం ఊహించలేదు. కానీ నా పాలిట పోలీసులు రియల్ హీరోలుగా నిలిచారు. అమితమైన బాధ్యతలు, ఒత్తిళ్లు ఉన్నా రణ్ విజయ్ సార్.. మా జీవితాలకు విలువనిచ్చారు. నా భర్తను స్వయంగా కలిసి, ఆపద సమయంలో నన్ను చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. అందుకే నాకు తొలిసారి పుట్టిన బిడ్డకు ఆ మానవతావాది పేరే మహ్మద్ రణ్ విజయ్ ఖాన్ అని పెట్టుకున్నాం’’ అంటూ తమన్నా ఆ పోలీస్ అధికారికి ధన్యవాదాలు తెలిపారు.
Tags : CORONAVIRUS, lockdown , bareilly, uttar pradesh, pregnant, police, humanity