నవంబర్‌లో బ్యాంకుల పని దినాలు 13 రోజులే..

దిశ, డైనమిక్ బ్యూరో : నవంబర్ నెలలో బ్యాంకు పని దినాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు, ఆదివారాలు, 2 శనివారాలు కలుపుకొని మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే, ఇవి అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీపావళి (నవంబర్‌ 4), గురునానక్‌ జయంతి/ కార్తీక పూర్ణిమ (నవంబర్‌ […]

Update: 2021-10-25 09:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : నవంబర్ నెలలో బ్యాంకు పని దినాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. నవంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు, ఆదివారాలు, 2 శనివారాలు కలుపుకొని మొత్తం 17 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే, ఇవి అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి.

ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీపావళి (నవంబర్‌ 4), గురునానక్‌ జయంతి/ కార్తీక పూర్ణిమ (నవంబర్‌ 19) రెండు రోజులు, సాధారణ సెలవులు (శని, ఆదివారాలు)తో కలిపి మొత్తం 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఈ సందర్భంగా బ్యాంకు లావాదేవీల విషయమై బ్యాంకులకు వచ్చే వారు దీనిని గమనించాలని ఆర్బీఐ పేర్కొంది.

Tags:    

Similar News