అలర్ట్: 4 రోజులు బ్యాంకులుండవ్

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకు ఖాతాదారులకు గమనిక. ఈ నెలలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులుండవ్. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతాదారులు ముందుగానే తెలుసుకుని తమ ఆర్థిక అవసరాల విషయంలో జాగ్రత్త పడటం మంచిది. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 15, 16వ తేదీల్లో బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ఆ రెండు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక మార్చి 13వ తేదీ రెండో శనివారం బ్యాంకులకు సెలవు. ఇక 14వ తేదీ ఆదివారం బ్యాంకులు […]

Update: 2021-03-09 02:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకు ఖాతాదారులకు గమనిక. ఈ నెలలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులుండవ్. ఈ విషయాన్ని బ్యాంకు ఖాతాదారులు ముందుగానే తెలుసుకుని తమ ఆర్థిక అవసరాల విషయంలో జాగ్రత్త పడటం మంచిది.

బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 15, 16వ తేదీల్లో బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ఆ రెండు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక మార్చి 13వ తేదీ రెండో శనివారం బ్యాంకులకు సెలవు. ఇక 14వ తేదీ ఆదివారం బ్యాంకులు ఉండవు. దీంతో మార్చి 13 నుంచి మార్చి 16వరకు బ్యాంకులు మూతపడనున్నాయి.

అయితే బ్యాంకు బ్రాంచీలు మాత్రమే ఉండవు. ఇంటర్నెట్, మొబైల్ బ్యాకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. వాటి ద్వారా బ్యాంకు ఖాతాదారులు తమ లావాదేవీలు జరుపుకోవచ్చు.

Tags:    

Similar News