న్యాయవాది ఖాతా తెరిచిన బ్యాంక్ మేనేజర్ అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: అక్రమ లావాదేవీల కోసం ఓ న్యాయవాది పేరిట ఖాతాను తెరిచిన ప్రైవేటు బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తెనాలికి చెందిన న్యాయవాది పేరిట ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ దుర్గాప్రసాద్ ఖాతా తెరిచాడు. తనకు తెలియకుండా ఖాతా తెరవడంపై న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, బ్యాంక్ ఖాతాలో రూ.19 లక్షల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సదరు న్యాయవాది దగ్గర […]
దిశ, వెబ్‌డెస్క్: అక్రమ లావాదేవీల కోసం ఓ న్యాయవాది పేరిట ఖాతాను తెరిచిన ప్రైవేటు బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తెనాలికి చెందిన న్యాయవాది పేరిట ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ దుర్గాప్రసాద్ ఖాతా తెరిచాడు. తనకు తెలియకుండా ఖాతా తెరవడంపై న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, బ్యాంక్ ఖాతాలో రూ.19 లక్షల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు.
సదరు న్యాయవాది దగ్గర దుర్గాప్రసాద్ సోదరుడు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోదురుడి సాయంతో న్యాయవాది ఆధార్ నెంబర్ సేకరించి.. బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసినట్లు గుర్తించారు. అక్రమ లావాదేవీల కోసమే దుర్గప్రసాద్ ఖాతా తెరిచినట్టు పోలీసులు నిర్ధారించారు.