గురువు ‘రుణం’ ఇలా తీర్చుకున్నాడు!

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి సక్సెస్‌ఫుల్ స్టోరీకి కష్టాలతో కూడుకున్న ప్లాష్‌బ్యాక్ తప్పక ఉండే ఉంటుంది. కెరీర్‌‌ను నిర్మించుకునే క్రమంలో మన కోసం చేసే చిన్న సాయమైనా.. అది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఒక్కోసారి ఆ చిరు సాయమే జీవితాన్ని మలుపు తిప్పొచ్చు కూడా. అలా.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వైద్యనాథన్ కష్టాల్లో ఉన్నప్పుడు తన గురువు ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఆయన తన గురువుకు లక్షల రూపాయలు అందించాడు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ […]

Update: 2020-10-07 03:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి సక్సెస్‌ఫుల్ స్టోరీకి కష్టాలతో కూడుకున్న ప్లాష్‌బ్యాక్ తప్పక ఉండే ఉంటుంది. కెరీర్‌‌ను నిర్మించుకునే క్రమంలో మన కోసం చేసే చిన్న సాయమైనా.. అది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఒక్కోసారి ఆ చిరు సాయమే జీవితాన్ని మలుపు తిప్పొచ్చు కూడా. అలా.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వైద్యనాథన్ కష్టాల్లో ఉన్నప్పుడు తన గురువు ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఆయన తన గురువుకు లక్షల రూపాయలు అందించాడు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ వివరాలు..

వైద్యనాథన్ చెన్నైలో ఉండేవాడు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మెస్రా)లో ఇంజనీరింగ్ కోర్సుకు ఎంపికైటన టైమ్‌లో ఇంటర్వ్యూ అటెండ్ చేయాలన్నా, కౌన్సిలింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలన్నా మనీ కావాలి. కానీ ఆ సమయంలో వైద్యనాథన్ దగ్గర డబ్బులు లేవు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉండగా, అతని గురువు గుర్డియాల్ సైనీ.. వైద్యనాథన్‌కు రూ.500 ఇచ్చాడు. వాటితో వైద్యనాథన్ బిర్లాలో ఫార్మాలిటీస్ పూర్తి చేసిన వైద్యనాథన్.. ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. అంతేకాదు, ఎంతో గొప్పగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. అయితే, అప్పటి నుంచి తన గురువు సైనీని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయినా గురువు చేసిన సాయాన్ని మరిచిపోలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ అవకాశం రాగా, తన టీచర్‌కు లక్ష ఈక్విటీ షేర్లు గిఫ్ట్‌గా ఇచ్చి గురుదక్షిణ తీర్చుకున్నాడు. వాటి విలువ రూ. 30 లక్షల రూపాయలు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

‘సెబీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం.. వైద్యనాథన్ లక్ష ఈక్విటీ షేర్లను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అతని మాజీ స్కూల్ టీచర్ గుర్డియాల్ సరూప్ సైనీకి గిఫ్ట్‌గా ఇస్తున్నారు. కెరీర్ తొలి రోజుల్లో చేసిన సాయానికి గుర్తుగా ఇలా చేశారు’ అని ఐడీఎఫ్‌సీ నోటీస్‌లో పేర్కొంది.

Tags:    

Similar News