‘ఉపాధి లేక దొంగయ్యాడు’
దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉమా శంకర్ (24) హైదరాబాద్ నగరానికి ఉపాధి నిమిత్తం వచ్చాడు. యూసుఫ్ గూడ, ఎల్ఎన్ నగర్ లో నివాసం ఉండే ఉమాశంకర్ కొన్నాళ్లు దినసరి కూలీ పనిచేశాడు. ఆ […]
దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉమా శంకర్ (24) హైదరాబాద్ నగరానికి ఉపాధి నిమిత్తం వచ్చాడు. యూసుఫ్ గూడ, ఎల్ఎన్ నగర్ లో నివాసం ఉండే ఉమాశంకర్ కొన్నాళ్లు దినసరి కూలీ పనిచేశాడు. ఆ తర్వాత పలు సీరియల్స్ లో ఆర్టిస్ట్ గా పనిచేశాడు. ఈ క్రమంలో మద్యం, దూమపానానికి బానిస కావడంతో పాటు ఇతర చెడు వ్యసనాలకు అలవర్చుకున్నాడు.
ఇటీవల కరోనా నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో వ్యసనాలకు అయ్యే ఖర్చుల నిమిత్తం దొంగతనాలు చేయాలని భావించాడు. దీంతో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.10 లక్షల విలువైన 12.5 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస రావు, ఇన్ స్పెక్టర్ కళింగరావు తదితరులు పాల్గొన్నారు.