కమీషన్ల కోసమే ప్రాజెక్టుల టెండర్లు: సంజయ్
దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే ప్రాజెక్టుల అంచనాలు పెంచి టెండర్లు పిలుస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్లను పిలిచి కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషయమై శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ నేత్వత్వంలో గవర్నర్ తమిళసైకి వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నారు. […]
దిశ, న్యూస్‌బ్యూరో: సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే ప్రాజెక్టుల అంచనాలు పెంచి టెండర్లు పిలుస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్లను పిలిచి కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషయమై శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ నేత్వత్వంలో గవర్నర్ తమిళసైకి వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్నారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి కేసీఆర్ బంధువుల కోసమే టెండర్లు వేశారన్నారు. ప్రతిపక్షాలపై కేసీఆర్ ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరైనది కాదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదన్నారు. కేసీఆర్ డైరెక్షన్‌లో జరుగుతున్న లూటీకి బీజేపీ వ్యతిరేకమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. దీనిపై సీబీఐ, సీఐడీ విచారణ జరపించాలని గవర్నర్‌ను కోరామన్నారు.