టీఆర్ఎస్ వాళ్లని బండకేసి కొట్టండి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, జమ్మికుంట: టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బట్టలు బండకేసి కొట్టినట్టు కొట్టాలంటూ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. మన మీటింగ్‌కి కరెంట్ కట్ చేశారు అంటేనే మనం గెలిచినట్టన్నారు. హుజురాబాద్‌లో ఈటల గెలవడం ఖాయమని, ఆ తరువాత సీఎం పవర్ కట్ అవుతుందన్నారు. రాజేందర్ నిస్వార్థం, కల్మశం లేని వ్యక్తి అని.. ఆయన్ని గెలిపించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాజేందర్‌ను వదిలి టీఆర్‌ఎస్‌లోకి పోయిన వాళ్ల గతి ‘న ఘర్ […]
దిశ, జమ్మికుంట: టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బట్టలు బండకేసి కొట్టినట్టు కొట్టాలంటూ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. మన మీటింగ్‌కి కరెంట్ కట్ చేశారు అంటేనే మనం గెలిచినట్టన్నారు. హుజురాబాద్‌లో ఈటల గెలవడం ఖాయమని, ఆ తరువాత సీఎం పవర్ కట్ అవుతుందన్నారు. రాజేందర్ నిస్వార్థం, కల్మశం లేని వ్యక్తి అని.. ఆయన్ని గెలిపించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాజేందర్‌ను వదిలి టీఆర్‌ఎస్‌లోకి పోయిన వాళ్ల గతి ‘న ఘర్ కా.. న ఘాట్ కా’ అన్నట్టుగా తయారయిందన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతే గడీలు బద్దలు అవుతాయన్నారు. హైదరాబాద్ వరదల్లో మోసం చేసినట్టే దళితులను కూడా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రజకులు నిజాయితీ పరులని వారికి రజక బంధు కూడా అమలు చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ వారసులంతా 30వ తేదీన దమ్ము చూపాలని పిలుపునిచ్చారు.
రాజీనామా చేస్తే ఇన్ని వచ్చాయ్.. మరి గెలిస్తే..
తాను రాజీనామా చేస్తేనే ఇన్ని వస్తే గెలిస్తే ఇంకా ఎన్ని వస్తాయో ఆలోచించాలని ఈటల రాజేందర్ అన్నారు. తన రాజీనామా వల్ల ఏం వచ్చాయో వివరిస్తూ బీఎస్ రాములు గొప్పగా రాశారని తెలిపారు. సీఎం ఇప్పుడే ఆగం ఆగం అయితుండట.. ఈ రాష్ట్ర చరిత్రలో ఒక్క బీసీ బిడ్డ కూడా సీఎం కాలేదు అని వారే అంటున్నారన్నారు. రజకులు చాకలి ఐలమ్మ వారసులని దొరతనాన్ని చీల్చి చెండాడుతారన్నారు. బండి సంజయ్ మీటింగ్‌కి వస్తే కరెంటు కట్ చేశారు. ఇలాంటి చిల్లరపనులు తగదని వ్యాఖ్యానించారు. బీజేపీ మీటింగ్‌కి పోవద్దని దావత్‌లు ఇస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారు.. సహనానికి పరీక్ష పెట్టవద్దు.. మాతో గొక్కోవద్దు.. ధర్మంతో పెట్టుకోవద్దు.. రజకులతో అసలు పెట్టుకోవద్దని ఈటల వార్నింగ్ ఇచ్చారు.