కేసీఆర్ నీ సంగతి చూస్తా: బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేటలో తనను అక్రమంగా కారణం లేకుండా అరెస్ట్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. సీపీ జోయల్ డేవిస్ ఎందుకు అరెస్ట్ చేశారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతోనే సీపీ ఇలా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. ఫామ్ హౌస్‌లో తప్పతాగి కేసీఆర్ పాలన చేస్తున్నారని.. కేసీఆర్ సంగతి చూస్తా అంటూ బండి సంజయ్ హెచ్చరించారు. దుబ్బాక ఫలితాల […]
దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేటలో తనను అక్రమంగా కారణం లేకుండా అరెస్ట్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. సీపీ జోయల్ డేవిస్ ఎందుకు అరెస్ట్ చేశారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతోనే సీపీ ఇలా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. ఫామ్ హౌస్‌లో తప్పతాగి కేసీఆర్ పాలన చేస్తున్నారని.. కేసీఆర్ సంగతి చూస్తా అంటూ బండి సంజయ్ హెచ్చరించారు.
దుబ్బాక ఫలితాల నుంచి టీఆర్ఎస్ సమాధి అవుతోందని ఆయన జోష్యం చెప్పారు. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తోందన్న బండి సంజయ్.. పత్రికా స్వేచ్ఛను కొన్ని చానళ్లు హరించాయన్నారు. పత్రికలు అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించారని బండి దుయ్యబట్టారు. కష్టపడి పని చేసే పత్రికలు నిజాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాయన్నారు. తెలంగాణలో 30 లక్షల సభ్యత్వం కలిగిన నికార్సైన కార్యకర్తలు ఒక్కసారిగా ఉద్యమిస్తే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలని బండి సంజయ్ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. అగ్గి పెట్టలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు.